
స్పందించిన న్యాయమూర్తి
సింగిల్ నంబర్ లాటరీ కేరాఫ్ కాకినాడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సింగిల్ నంబర్ లాటరీకి కేరాఫ్‌గా కాకినాడ నిలుస్తోంది. బెంగళూరు నగరంలోని రెండు ముఖ్య కూడళ్లు కేంద్రంగా సాగుతున్న ఈ దందా వెనుక పెద్దల హస్తం ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. ఈ లాటరీతో నిరుపేదలు, రోజువారీ శ్రమజీవుల బతుకులు గుల్లవుతున్నాయి. ఒకటికి ఏడు, ఎనిమిదింతలు వస్తుందనే ఆశ చూపి, నిర్వాహకులు నిలువు దోపిడీ చేస్తున్నారు. సింగిల్ నంబర్ లాటరీపై నిషేధం ఉన్నా కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక కాకినాడలో మాత్రం తలుపులు బార్లా తెరిచారు. నెలవారీగా ఎవరి వాటాలు వారి జేబుల్లోకి వెళ్లిపోతూండటంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా సాగిస్తున్నారు. ఈ సింగిల్ నంబర్ లాటరీకి కాకినాడ నగరంలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు డెన్‌లు నడుస్తున్నాయి. ఒకో డెన్‌ను ఇద్దరు తెలుగు తమ్ముళ్లు నిర్వహించుకునేందుకు ఒప్పందాలు జరిగాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సింగిల్ నంబర్ లాటరీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక తెలుగు తమ్ముళ్లు అధికారం దన్నుతో ఈ జూద క్రీడను తిరిగి పట్టాలెక్కించారు. సుమారు ఆరు నెలలుగా సాగుతున్న సింగిల్ నంబర్ లాటరీతో రోజూ రూ.లక్షలు చేతులు మారుతున్నా కన్నెత్తి చూసే నాథుడే లేకుండా పోయాడనే విమర్శలు వస్తున్నాయి. సింగిల్ నంబర్ లాటరీ ఉదయం 8 గంటలకు మొదలై రాత్రి 8 లేదా 9 గంటల వరకూ నిర్వహిస్తున్నారు. వీధుల్లో కర్రా బిళ్ల ఆడినట్లుగా బహిరంగంగానే ఆడేస్తున్నారు. దీనిని కట్టడి చేయాల్సిన పోలీసులు అధికార పార్టీలోని ముఖ్య నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గాల్సి వస్తోందని అంటున్నారు. సింగిల్ నంబర్ లాటరీ కొడితే ఒకటికి ఏడెనిమిది రెట్లు అధికంగా వస్తుందనే ఆశతో రెక్కల కష్టాన్నే నమ్ముకున్న శ్రమజీవులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర పేదల బతుకులు గుల్లయిపోతున్నాయి.
ఇవీ డెన్‌లు
కాకినాడ సంజయ్‌నగర్ లారీ సీరియల్ ఆఫీసు సమీపాన సింగిల్ నంబర్ లాటరీ నడుస్తోంది. ఈ డెన్ కాకినాడ పోర్టు పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తోంది. కాకినాడ రాగంపేట పరిధిలో మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో కల్పనా సెంటర్ ఫ్‌లై ఓవర్ కింద మరో డెన్ నిర్వహిస్తున్నారు. మూడో డెన్ జగన్నాథపురం చారిటీస్ వద్ద నూకాలమ్మ టెంపుల్ వెనుక ఉన్న పార్కు సమీపాన జరుగుతోంది. ఈ ప్రాంతం వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ మూడు కేంద్రాల్లోనూ కూటమికి చెందిన ద్వితీయ శ్రేణి నేతల కనుసన్నల్లోనే సింగిల్ నంబర్ లాటరీ జరుగుతోంది.
ఇలా జరుగుతోంది
బెంగళూరుకు చెందిన లాటరీ నిర్వాహకులు ఒకటి నుంచి తొమ్మిది నంబర్లు (సింగిల్ డిజిట్) మొబైల్‌లో డిస్‌ప్లే చేస్తారు. కాకినాడలో లాటరీ డెన్ నడుపుతున్న నిర్వాహకుడు మొబైల్‌లో ఒకటి నుంచి తొమ్మిది నంబర్లలో ఏదో ఒక నంబర్‌ను లాటరీ వేసే వ్యక్తికి సూచిస్తాడు. గంటగంటకూ బెంగళూరు నుంచి నంబర్ షో ఉంటుంది. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు సంజయ్ నగర్‌లోని లాటరీ డెన్ వద్దకు వచ్చిన సుబ్బారావు అనే వ్యక్తి ఐదో నంబర్‌పై రూ.వెయ్యి కాశాడని అనుకుంటే.. ఈ విషయాన్ని ఒక కాగితంపై రాసి ఇస్తారు. తొమ్మిది గంటలకు నిర్వాహకుడు మొబైల్‌లో ఏ నంబర్‌కు షో వచ్చిందో చూపిస్తాడు. లాటరీ షోలో ఐదో నంబర్ చూపిస్తే రూ.8 వేలు (రూ.వెయ్యికి ఎనిమిది రెట్లు) తిరిగిస్తారు. అంటే గంటలోనే లాటరీ ఫలితం తేలిపోతుందన్న మాట. మిగిలిందంతా నిర్వాహకులకే. ఇలా ఒక డెన్‌లో రోజుకు 100 నుంచి 200 మంది సింగిల్ నంబర్ లాటరీ ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మూడు డెన్‌లలో కలిపి ప్రతి రోజూ తక్కువలో తక్కువ రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. ఇందులో 5 శాతం కూటమి ముఖ్య నేతలకు, పోలీసులకు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగిల్ నంబర్ లాటరీలు జరిగే డెన్‌ల వద్ద జనం పెద్ద ఎత్తున గుమిగూడుతూ, గంజాయి, మద్యం మత్తులో తూగుతూ తరచూ ఘర్షణలకు దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా తయారయ్యాయని అంటున్నారు.
మతి స్థిమితం లేని యువతికి వైద్యం
ఫ మూడు డెన్‌లు.. రూ.30 లక్షలు
ఫ గంట గంటకూ నంబర్ షో
ఫ ఒకటికి ఎనిమిది రెట్లు
ఫ బెంగళూరు కేంద్రంగా
కాయ్ రాజా కాయ్!
ఫ ‘తమ్ముళ్ల’ కనుసన్నల్లో లాటరీ
ఫ శ్రమజీవుల బతుకులు గుల్ల
ఫ పోలీసుల ప్రేక్షక పాత్ర
ఫ ముఖ్య నేతల జేబుల్లోకి నాలుగో వంతు