ఉద్యోగినులకు రేపు క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగినులకు రేపు క్రీడా పోటీలు

Mar 4 2025 12:15 AM | Updated on Mar 4 2025 12:14 AM

కాకినాడ సిటీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగినులకు సాంస్కృతిక, ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్‌జీవో సంఘం మహిళా విభా గం చైర్‌పర్సన్‌ బి.సుజాత తెలిపారు. ఈ పోటీలకు క లెక్టర్‌ షణ్మోహన్‌ను ఎన్‌జీవో సంఘం నేతలు సోమ వారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారితో కలసి క్రీడా పోటీల పోస్టర్‌ను కలెక్టర్‌ కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డులో జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ క్రీడా మైదానంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి జరిగే క్రీడా పోటీల్లో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ఉమ్మ డి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు గుద్దటి రామ మోహన్‌రావు, కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, కోశాధికారి వై.పద్మమీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

నెలాఖరు వరకూ

గాలికుంటు నివారణ టీకాలు

కాకినాడ సిటీ: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు ఈ నెలాఖరు వరకూ టీకాలు వేస్తామని జిల్లా పశు సంవర్ధక శాఖ అదనపు సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ ఆర్‌.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ష ణ్మోహన్‌ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆరో విడత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఈ నెల 31వ తేదీ వర కూ వేస్తామని చెప్పారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వరరావు కోరారు.

సీనియారిటీ జాబితాపై

అభ్యంతరాల స్వీకరణ

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలుంటే ఈ నెల 10వ తేదీలోగా తన కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యా శాఖ వెబ్‌సైట్‌లో సీనియారిటీ జాబితా ఉందని, అభ్యంతరం తెలిపేవారు ఉపాధ్యాయుడి పూ ర్తి పేరు, అభ్యంతరానికి కారణాన్ని సాక్ష్యాలతో సహా వివరించాలని సూచించారు. గడువు తరువాత వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు.

డ్వామా పీడీగా శ్రీనివాసరావు

కాకినాడ సిటీ: డీఆర్‌డీఏ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా జి.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నెల్లూరు జిల్లా డ్వామా పీడీగా పని చేస్తూ బదిలీపై ఇక్కడకు వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement