క్రాప్‌హాలిడే ప్రకటించాం.. | - | Sakshi
Sakshi News home page

క్రాప్‌హాలిడే ప్రకటించాం..

Jun 19 2026 12:30 AM | Updated on Jun 19 2026 12:30 AM

క్రాప్‌హాలిడే ప్రకటించాం.. టమాటా సాగుచేస్తున్నా.. మా దృష్టికి వచ్చింది..

నేను ఐదేళ్లుగా కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని సీడ్‌పత్తిని సాగు చేసుకుంటూ వచ్చా. గతేడాది పండించిన సీడ్‌పత్తి గింజల డబ్బులు ఇంకా చేతికందలేదు. ఈసారి సీడ్‌పత్తి గింజలను ఆర్గనైజర్‌ ఇవ్వకపోవడంతో సాగు నిలిపివేశా. చాలా మంది క్రాప్‌హాలిడే ప్రకటించారు.

– తిమ్మప్ప, రైతు, సల్కాపురం,

గట్టు మండలం

పదేళ్లుగా సీడ్‌ పత్తి సాగుచేస్తున్నా. గతేడాది ఎకరన్నర విస్తీర్ణంలో సీడ్‌ పత్తి పండించా. ఈసారి పెట్టుబడితో పాటు సీడ్‌ పత్తి గింజలను ఇవ్వకపోవడంతో చేసేదేమీ లేక సాగును నిలిపివేశాం. సీడ్‌ పత్తి పంటకు బదులు టమాటా సాగు చేద్దామని పొలాన్ని సిద్ధం చేసుకున్నా. వర్షం కురిస్తే టమాటా నారు నాటుకుంటా.

– నర్సింహులు, రైతు, రాయాపురం,

గట్టు మండలం

సీడ్‌ కంపెనీలు రైతులకు అందజేసే విత్తనాలను తగ్గించుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈసారి ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాబావ పరిస్థితులు ఉండొచ్చనే ముందస్తు ఉహాగానాల నేపథ్యంలో సాగుపై ప్రభావం పడింది. రైతులు సీడ్‌పత్తి సాగుపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. సీడ్‌ పత్తి సాగుపై ఈ నెలాఖరు వరకు ఓ అంచనాకు రావొచ్చు.

– వీరప్ప, డీఏఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement