 
															రూ.22.59 లక్షలుపలికిన టెంకాయల వేలం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం 11గంటలకు ఆలయ ఆవరణలో ఈఓ సత్యచంద్రారెడ్డి సమక్షంలో టెంకాయల వేలం నిర్వహించారు. వేలంలో 20 మంది పాల్గొనగా వారిలో మల్దకల్‌కి చెందిన నర్సింహులు రూ.22.59 లక్షలకు వేలం పాడి దక్కించుకున్నట్లు ఆలయ ఈఓ తెలిపారు. అలాగే తలనీలాల వేలాన్ని మహబూబ్‌నగర్‌కు చెందిన రామన్‌గౌడ్ రూ.3.17లక్షలకు దక్కించుకున్నారు. టెంకాయల వేలంలో గత సంవత్సరం కంటే ఈ ఏడాది రూ.47వేలు అధిక ఆదాయం వచ్చింది. కార్యక్రమంలో బీచుపల్లి ఆలయ ఈఓ రామన్‌గౌడ్, ఆలయ నిర్వాహకుడు అరవింద రావు, చంద్రశేఖర్ రావు, ఆలయ సిబ్బంది బ్రహ్మయ్య, రంగనాథ్, శ్రీను, కృష్ణ, ఉరుకుందు, చక్రి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలనుసద్వినియోగం చేసుకోండి
రాజోళి: చేనేత కార్మికులకు వారికి వర్తించే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ సిల్క్ బోర్డు ఽ(ధర్మవరం శాఖ) అధికారులు అన్నారు. బుధవారం రాజోళిలోని రైతు వేదికలో చేనేత కార్మికులకు పలు పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైంటిస్ట్ దీపక్, టెక్నికల్ అసిస్టెంట్ అశోక్ దేశాయ్ మాట్లాడుతూ చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకువచ్చిందని వాటిని సద్వినియోగం చేసుకుని చేనేత కార్మికులు వృత్తిలో రాణించవచ్చని అన్నారు. రంగులు అద్దటం, మగ్గం నేయడం, సిల్క్‌ను వాడటంలో మెళకువలను తెలిపారు. వాటాదారుడు 25 శాతం పెట్టుబడి పెడితే, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం, కేంద్ర ప్రభుత్వం 50 శాతంతో కార్మికులకు రుణాలు అందే విధంగా పథకాలు ఉన్నాయని అన్నారు. రూ.11 వేల నుంచి రూ.కోటి వరకు రుణం తీసుకోవచ్చని, ఆసక్తి గల కార్మికులు దరఖాస్తు చేసుకుంటే పథకాలు అందించేలా చూస్తామన్నారు.
ఆలయ ప్రతిష్టను కాపాడండి
అలంపూర్: అలంపూర్ క్షేత్ర ఆలయాల ప్రతిష్టను కాపాడాలని కోరుతూ హైదరాబాద్‌లోని దేవదాయ ధర్మాదాయ కార్యాలయాల్లో ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజ రామయ్యర్, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణిని కలిసి అలంపూర్ ఆలయాల మాజీ ధర్మకర్త నాగశిరోమణి, ఆర్‌టీఏ కమిటీ సభ్యుడు పల్లి సతీష్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహేష్‌గౌడ్ బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ రాష్ట్రంలో ఏకై క శక్తిపీఠంగా పేరుగాంచిన జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి, నవబ్రహ్మ ఆలయాలు అలంపూర్ నియోజకవర్గానికి ఆధ్యాత్మి క శోభను, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపుగా ఉన్నాయన్నారు. ఇటీవల ఆలయ పరిపాలన, టెండర్ల నిర్వహణలో కూరగాయల సరఫరా టెండర్ అంశంలో చోటుచేసుకున్న పరిణామాలు విచారకరమని పేర్కొన్నారు. వివాదాన్ని పరిష్కరించాల్సిన అధికారి ఒక వర్గంతో కలిసి ఆలయ ఆవరణలో మీడియా సమావేశాలు నిర్వహించడం బాధాకరమన్నారు. టెండర్లపై పక్షపాత లేఖలు తీసు కోవడం, ఉద్యోగులు సైతం ఉద్యోగ నియ మావళికి విరుద్ధంగా నిరసనలు చేయడం వంటి ఫొటోలను సామజిక మధ్యమాలో పోస్ట్ చే యడం ఆలయాల పవిత్రతకి, రాష్ట్ర దేవాదా యశాఖ ప్రతిష్ఠకు భంగం వాటిల్లితున్నట్లు వినతిలో పేర్కొన్నారు. ఆలయ గౌరవాన్ని కాపాడే విధంగా వివాదాలకు ముగింపు పలకడానికి ప్రభుత్వం తగుచర్యలు తీసుకోవాలన్నారు.
వేరుశనగ క్వింటా రూ.4,629
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 88 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ. 4629, కనిష్టం రూ. 2839 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టం రూ. 5900 ధరలు పలికాయి.
 
							రూ.22.59 లక్షలుపలికిన టెంకాయల వేలం
 
							రూ.22.59 లక్షలుపలికిన టెంకాయల వేలం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
