నెరవేరిన ‘రుణ’ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నెరవేరిన ‘రుణ’ లక్ష్యం

May 12 2025 12:33 AM | Updated on May 12 2025 12:33 AM

నెరవే

నెరవేరిన ‘రుణ’ లక్ష్యం

ఇందిరా మహిళా శక్తి

కింద యూనిట్లు

2024–25లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద భ్యాంకుల ద్వార రుణాలు పొందిన మహిళలు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించింది. వ్యక్తిగత యూనిట్లతో పాటు ప్రధానంగా ఒక సంఘంలో నలుగురు, ఐదుగురితో కలిసి గ్రూప్‌ యూనిట్లు నెలకొల్పుకునేలా ప్రోత్సహించారు. ఈపథకం కింద 2024–25లో క్యాంటీన్లు, కిరణాలు, టైలరింగ్‌, బ్యూటీపార్లర్లు, పాడి, చీరలు, స్వీట్‌ దుకాణాలు, అగర్‌బత్తీలు, రోటీ మేకింగ్‌ సెంటర్లు తదితర వాటిని స్వయం సహయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్నారు.

గద్వాల న్యూటౌన్‌: 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు రుణ లక్ష్యం నెరవేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు మండలాలు మినహా, లక్ష్యం మేరకు రుణాలు అందించారు. స్వయం సహయక సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు బ్యాంక్‌ లింకేజీ కింద బ్యాంకుల ద్వార రుణాలు అందిస్తారు.

బ్యాంకుల ద్వార రుణాలు

పది నుంచి పదిహేను మంది మహిళలు కలిసి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడగా.. వారంతా ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు బ్యాంకుల ద్వార గ్రూపు రుణాలు అందిస్తారు. ఇందుకోసం ప్రతి ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలను నిర్ధేశిస్తారు. బ్యాంకు ద్వార రుణాలు పొందే గ్రూపు మహిళలు వారు నిర్వహించుకునే వ్యాపారాలు సూచిస్తూ బ్యాంకు లింకేజీ కింద బ్యాంకులకు దరఖాస్తు చేసుకుంటారు. బ్యాంకులు ఆయా స్వయం సహాయక సంఘాల సీనియారిటీ అంతకుముందు తీసుకున్న అప్పుకు సంబందించి వారి చెల్లింపులను పరిగణలోకి తీసుకుంటారు. డోస్‌ల వారీగా రూ. లక్ష నుంచి రూ.20లక్షల వరకు రుణాలు అందిస్తారు. బ్యాంకర్లు ఇచ్చిన అప్పుకు 12 నుంచి 14శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది.

5248 సంఘాలు.. రూ.204.29 కోట్లు

డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల నిర్వహణ చూస్తుంటారు. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల రుణ లక్ష్యం 5248 సంఘాలకు రూ. 204.29కోట్లు లక్ష్యం ఉండగా.. 2,355 సంఘాలకు 217.57 కోట్లు అందించారు. మండలాల వారీగా పరిశీలిస్తే ఇటిక్యాలలో 186శాతం, ధరూర్‌లో 145శాతం, అలంపూర్‌లో 121శాతం, గద్వాల 119శాతం, వడ్డేపల్లిలో 118శాతం, మల్దకల్‌లో 110శాతం, గట్టులలో 102శాతం రుణ లక్ష్యం నెరవేరింది. ఇక కేటీదొడ్డిలో 87శాతం, ఉండవల్లిలో 82శాతం, రాజోళిలో 72శాతం, మానవపాడులో 70శాతం, అయిజలో 65శాతం నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పించారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు చిన్న, పెద్ద వ్యాపారాలు నిర్వహించుకుని, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అందించే ఈరుణాల లక్ష్యంపై డీఆర్‌డీఏ అధికారులు, సిబ్బంది ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే దృష్టి సారించారు. సంబంధిత అధికారులు ప్రతి నెల సమీక్షలు నిర్వహిస్తూ సిబ్బందికి దిశానిర్ధేశం చేయడం వల్ల జిల్లా రుణ లక్ష్యం నెరవేరింది.

స్వయం సహాయ సంఘాల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

‘ఇందిరా మహిళా శక్తి’ కింద మహిళలకు బ్యాంకుల ద్వారా వ్యాపార యూనిట్లు

చిన్న, పెద్ద వ్యాపారాలు నిర్వహించుకునేలా ప్రోత్సాహం

రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహళలు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. 2024–25లో లక్ష్యం మేరకు రుణాలు అందించాం. ఈఏడాది తీసుకున్న రుణాలతో ఇందిరా మహిళాశక్తి పథకం కింద చాలా వ్యాపారాల యూనిట్లు నెలకొల్పారు. వీటి నిర్వహణ ద్వార ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. 2025–26లో సైతం రుణ లక్ష్యం నెరవేరేలా చర్యలు తీసుకుంటాం.

– నర్సింగరావ్‌, అడిషనల్‌ కలెక్టర్‌

నెరవేరిన ‘రుణ’ లక్ష్యం 1
1/1

నెరవేరిన ‘రుణ’ లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement