
ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలి
మల్దకల్: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుచుకుంటూ దైవచింతన అలవర్చుకోవాలని త్రిదండి చినజీయర్ స్వామి సూచించారు. ఆదివారం మండలంలోని అమరవాయిలో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు ప్రవచనాలు వినిపించారు. ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో నడుచుకోవాలని, కులమతాలను రూపుమాపడాని,కి ప్రజల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి సర్వమతాలకు దేవుడు ఒక్కడేనని అన్నారు. భక్తులు ఆధ్యాత్మికతను అలవర్చుకోవడం వలన జీవితంలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకునే వీలుంటుందన్నారు. అంతకు ముందు వెంకటేశ్వరెడ్డి కుటుంబసభ్యులు స్వామి వారికి పాదపూజ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, చంద్రశేఖర్‌రావు, ముకుందరావు, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, వెంకట్రాములు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఘన స్వాగతం
ఇటిక్యాల: మండలంలోని మునుగాల గ్రామంలో ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భాగవత సప్తాహం పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చినజీయర్ స్వామి హాజరయ్యారు. ప్రతి మనిషికి ఆనందం ముఖ్యమని లౌకిక ఆనందం తాత్కాలికం మాత్రమేనని నిజమైన ఆనందం భాగవత ప్రవచనం ఆలకించడం ద్వారానే అనుభవం పొందగలుగుతారని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమీటి సభ్యులు, విశ్వ హిందు పరిషత్ సభ్యులు, ఆయా గ్రామాల భగవద్గీత భక్తులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.