
కేజీబీవీలో రికార్డులు పరిశీలిస్తున్న డీఈఓ సిరాజుద్దీన్
ఎర్రవల్లిచౌరస్తా: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ సిరాజుద్దీన్ అన్నారు. గురువారం ఇటిక్యాల మండలం పదో బెటాలియన్‌ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వార్షిక పరీక్షలకు ప్రణాళిక బద్దంగా చదివి మెరుగైన ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలన్నారు. అనంతరం కేజీబీవీని సందర్శించి పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఉపాద్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించి గత ఏడాదిలాగే వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ రాజు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.