
శాంతిభద్రతలకు భంగం కలగొద్దు
రఘునాథపల్లి: శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, కేసుల వేగవంతమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా ఆదివారం రఘునాథపల్లి సీఐ సర్కిల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. కేసులకు సంబంధించిన వివరాలు, ఇతరత్రా రికార్డులు పరిశీలించారు. సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో శాంతిభద్రతలు, పెండింగ్ కేసులపై ఏసీపీ, సీఐ, ఎస్సైలతో డీసీపీ సమీక్షించారు. వినాయక చవితి ఉత్సవాలతో పాటు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నందున క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, సమస్యాత్మక ప్రాంతాల సమాచారం అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీంశర్మ, జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, సర్కిల్ పరిధి ఎస్సైలు దూదిమెట్ల నరేశ్, శ్రవణ్‌కుమార్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డీసీపీ రాజమహేంద్రనాయక్