
మారని తీరు!
స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ అయినా కంపు కొడుతున్న వార్డులు
● అధ్వానంగా రోడ్లు, డ్రెయినేజీలు
● ఎక్కడి చెత్త అక్కడే..
● పారిశుద్ధ్య లోపంతో ప్రజల పాట్లు
స్టేషన్‌ఘన్‌పూర్
మున్సిపాలిటీ వివరాలు
విస్తీర్ణం 48.24 చ.కి.మీ.
వార్డులు 18
జనాభా 30,527
ఓటర్లు 18,358
పురుషులు 8,842
సీ్త్రలు 9516
గృహాలు 7,408
అసంపూర్తిగా డ్రెయినేజీ నిర్మాణం
స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మోడల్ కాలనీకి వెళ్లే రోడ్డులో ఉన్న డ్రెయినేజీ అసంపూర్తిగా నిర్మాణం చేయడంతో మురుగునీరు జనవాసాల్లో నిలుస్తుంది. డ్రెయినేజీ సమస్యను పట్టించుకునే వారు లేక కాలనీవాసులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు.
గుంతల రోడ్డుతో అవస్థలు
స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి అంబేడ్కర్ సెంటర్ రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. శివునిపల్లి నుంచి జఫర్‌గఢ్, ఐనవోలుకు వెళ్లేందుకు ఈ దారిపైనే ప్రయాణించాల్సి ఉంది. గుంతలమయమైన రోడ్డుపై అవస్థలు పడుతున్నారు.

మారని తీరు!

మారని తీరు!