విద్యార్థులు లక్ష్యంతో చదవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు లక్ష్యంతో చదవాలి

Jul 4 2025 7:01 AM | Updated on Jul 4 2025 7:01 AM

విద్య

విద్యార్థులు లక్ష్యంతో చదవాలి

లింగాలఘణపురం: విద్యార్థులు జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని అందుకుతగ్గట్టుగా కృషి చేసి సాధించాలని జనగామ సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సి.విక్రమ్‌ అన్నారు. మండలంలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలపై అ వగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు విద్యార్థులు బానిసలు కావొద్దని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఉ పాధ్యాయ బృందం, వలంటీర్లు పాల్గొన్నారు.

టీబీ కేసులను గుర్తించాలి

జనగామ: దేశ వ్యాప్తంగా చేపట్టిన టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ 100 రోజుల ప్రోగ్రాంలో కే సులను గుర్తించాలని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కా ర్యదర్శి ఆరాధన పట్నాయక్‌ ఆదేశించారు. గు రువారం ఢిల్లీ నుంచి టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ 100 రోజుల ఇంటెన్సిఫైడ్‌ క్యాంపెయి న్‌పై ఎండీ ఎన్‌హెచ్‌ఎంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టరేట్‌ నుంచి పీఓ ఎన్‌టీ ఈపీ సిబ్బందితో కలిసి అదనపు కలెక్టర్‌ పింకేష్‌ కుమార్‌, డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో 1,21,613 మందికి ఎక్స్‌రే, నాట్‌ ద్వారా టీబీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 736 మందికి ఎక్స్‌రే, 781 మందికి నాట్‌ టీబీ పరీక్షలు చేయగా.. 43 మందికి టీబీ ఉన్నట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

కాంట్రాక్టు టీచర్ల

వేతనాల విడుదల

జనగామ: 2008లో డీఎస్సీ అర్హత సాధించి పదహారేళ్లుగా పోరాటం చేస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కాంట్రాక్టు పద్దతిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పోస్టింగ్‌ ఇచ్చింది. ఇందులో జనగామ జిల్లాలో 32 మంది(ఎస్జీటీ)గా బాధ్యతలు స్వీకరించారు. 2025–26 వా ర్షిక సంవత్సరంలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న వీరి వేతనాలకు సంబంధించి జిల్లాకు రూ.1,33,73,800 విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

గైనిక్‌, అనస్థటిస్ట్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు

జనగామ: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్టు(1), అనస్థటిస్ట్‌(1) పోస్టుల ను నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ స్కీంలో కాంట్రాక్ట్‌ ప ద్దతిలో భర్తీ చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. గైనకాలజిస్టు(అర్హత ఎంబీబీఎస్‌/ ఎంఎస్‌,డీజీఓ/ మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌/వేతనం రూ.లక్ష) అనస్థటిస్ట్‌ పోస్టుకు(ఎండీ డిప్లొమా ఇన్‌ అనస్తియా (డీఏ), మెడికల్‌ కౌన్సి ల్‌ రిజిస్ట్రేషన్‌/వేతనం రూ.లక్ష) అర్హత కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఈ నెల 8వ తేదీన కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు.

కొనసాగుతున్న

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

జనగామ రూరల్‌: టీజీఎప్‌సెట్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతోందని కళాశాల ప్రిన్సిపాల్‌ రాత్‌ ఖహ్నం గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. ఇప్పటి వరకు 800లకుపైగా విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6:00 వరకు వరకు ఈప్రక్రియ ఉంటుందని తెలిపారు. వెరిఫికేషన్‌ పూర్తయిన వారు ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు కాలేజీ కోసం ఆన్‌లైన్‌లో ఆప్ష న్‌ ఇవ్వాలని తెలిపారు. 18న మొదటి విడత అలాట్‌మెంట్‌ జరుగుతుందని తెలిపారు.

నేడు కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు

జనగామ రూరల్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి పనిచేసిన కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు శుక్రవారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఉదయం నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొనాలని పేర్కొన్నారు.

విద్యార్థులు లక్ష్యంతో  చదవాలి 1
1/1

విద్యార్థులు లక్ష్యంతో చదవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement