
‘తొలి ఏకాదశి’కి ముస్తాబు
జనగామ: ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు. ఉత్తర దిక్కున ఉన్న సూర్యుడు, ఈరోజు నుంచి దక్షిణ దిక్కున ప్రయాణించడంతో దీనిని దక్షిణాయణంగా పరిగణిస్తారు. శివకేశవులు, విష్ణువుకు ఈరోజు ప్రీతికరమైన రోజు గా భావిస్తారు. నేడు (ఆదివారం) తొలి ఏకాదశి ప్రారంభం పురస్కరించుకుని జిల్లాలోని శివాలయాలు, వైష్ణవ దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు.
ముస్తాబవుతున్న ఆలయాలు
తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వర, చిల్పూరు వేంకటేశ్వర, పాలకుర్తి సోమేశ్వర, జనగామ పట్టణం బాణాపురం వేంకటేశ్వర, పాతబీటు రామలింగేశ్వర, సంతోషిమాత ఆలయాలను సుందరంగా అలంకరిస్తున్నారు. తొలిఏకాదశి పర్వదినం పురస్కరించుకుని నేడు తెల్లవారు జాము నుంచి ఆలయాలకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారు.
నేడు కురుమ కులస్తుల బోనాలు
పట్టణంలో కురుమ కులస్తులు బీరప్ప కామరతి, అక్క మహంకాళి దేవతామూర్తులకు బోనాలు సమర్పించనున్నారు. కుర్మవాడ నుంచి నెహ్రూపార్కు మీదుగా ఒగ్గుఢోలు కళాకారుల వాయిధ్యాలు, శివసత్తుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు వేలాది మంది మహిళలు బోనాలతో పాటు పట్టువస్త్రాలతో బీరప్ప ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, బోనం నైవేద్యం సమర్పించిన అనంతరం, పట్టు వస్త్రాలు కా నుకగా ఇచ్చి, ఓడిబియ్యం పోస్తారు. ఇందుకు సంబంధించి ఆలయం వద్ద ఏర్పాట్లు చేస్తుండగా, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
కురుమ కులస్తుల బోనాలు

‘తొలి ఏకాదశి’కి ముస్తాబు