
ఓటరు జాబితా సవరణలో జాగ్రత్తలు తీసుకోవాలి
పాలకుర్తి టౌన్: ఓటరు జాబితా సవరణలో బీఎల్‌ఓ లు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని ఎండీపీఓ కార్యాలయంలో పాలకుర్తి అసెంబ్లీ లెవ ల్ మాస్టర్ ట్రైనర్ నరసింహమూర్తి, శేషగిరిరావు బీఎల్‌ఓలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరమే నూతన ఓటరు నమోదు, సవరణ, తొలగింపు, బదిలీ, ఫొటో మార్పిడి తదితర సవరణలు చేపట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున బల్క్‌గా ఓటరు దరఖాస్తు ఫారాలు, ఒకే వ్యక్తి పెద్ద మొత్తంలో ఇచ్చే ఓటరు నమోదు దరఖాస్తులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీ బీఎల్‌ఓ ఓటర్లుకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.నాగేశ్వర్‌రావు, డీటీ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్‌ఐ రాకేష్, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్