ప్రజల ప్రాణాలపై పట్టింపు లేదు.. | - | Sakshi
Sakshi News home page

ప్రజల ప్రాణాలపై పట్టింపు లేదు..

Jul 6 2025 6:54 AM | Updated on Jul 6 2025 6:54 AM

ప్రజల

ప్రజల ప్రాణాలపై పట్టింపు లేదు..

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనగామ మండలం వడ్లకొండ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న గానుగుపహాడ్‌ కల్వర్ట్‌ బ్రిడ్జి ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిందన్నారు. మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో వచ్చే క్రమంలో అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారన్నారు. కాంట్రాక్టర్‌కు వెంటనే పెండింగ్‌ బిల్లులను చెల్లించి, గానుగుపహాడ్‌ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌

పోటీలకు ఎంపిక

జనగామ రూరల్‌: ఇటీవల నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్‌ పోటీల్లో పట్టణంలోని సెయింట్‌ మెరీస్‌ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ జైమోన్‌ థామస్‌ తెలిపారు. శనివారం రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు. అనంతరం ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ లాంగ్‌జంప్‌లో పి.మనోజ్‌, ఎ.బౌషిక్‌, 60 మీటర్ల రన్నింగ్‌లో పి.నిఖిల్‌ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబర్చాలని కోరారు. వ్యాయామ ఉపాధ్యాయుడు గుణవర్ధన్‌, నరసింహా, రాజు, హేమలతలు విద్యార్థులను అభినందించారు.

సార్వత్రిక సమ్మెను

జయప్రదం చేయాలి

జనగామ రూరల్‌: ఈ నెల 9న జాతీయ కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్‌ తెలిపారు. శనివారం ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో కేవీపీఎస్‌ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక సమ్మె కు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు, దళిత సంఘాల నాయకులు పాల్గొనాలన్నారు. జిల్లా అధ్యక్షుడు తుటి దేవదానం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యక్షులు పల్లెర్ల లలిత, మబ్బు ఉప్పలయ్య సహాయ కార్యదర్శి గండం యాదగిరి, కాకర్ల బాబు, బోట్ల శ్రావణ్‌, ఎండీ హతియా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

ఎలుగుబంట్లను

బంధించిన అధికారులు

జఫర్‌గఢ్‌: మండలంలో గత కొద్ది రోజుల నుంచి సంచరిస్తున్న ఎలుగుబంట్లను ఫారెస్టు అధికారులు బంధించారు. వివరాలిలా ఉన్నాయి... శనివారం మండలంలోని తీగారం గ్రామశివారులోని హనుమాన్‌తండా సమీపంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు ఫారెస్టు అధికారులకు తెలిపారు. దీంతో స్పందించిన ఎఫ్‌ఆర్‌ఓ మురళీధర్‌ నేతృత్వంలో ఫారెస్ట్‌ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ముందుగా తల్లి ఎలుగుబంట్టితో పాటు రెండు పిల్ల ఎలుగుబంట్లు ఉన్నట్లు గుర్తించారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి వాటిని బంధించారు. వీటిని హైదరాబాద్‌ జూపార్కుకు తరలిస్తున్నట్లు ఎఫ్‌ఆర్‌ఓ మురళీధర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ నర్సింగ్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ జరినాబేగం, బీట్‌ ఆఫీసర్‌ రవి, అంజి, వాచర్‌ మోహన్‌, సంతోష్‌, రిస్క్‌టీం సభ్యులు పాల్గొన్నారు.

ప్రజల ప్రాణాలపై  పట్టింపు లేదు..
1
1/1

ప్రజల ప్రాణాలపై పట్టింపు లేదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement