
బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
జనగామ రూరల్: జనగామ హుస్నాబాద్ రోడ్డు వడ్లకొండ, గానుగుపహాడ్ మధ్య అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలను ఆదుకోవాలని ఆదివారం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వడ్లకొండ మాజీ సర్పంచ్ బోల్లం శారద, గానుగుపహాడ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడతూ రెండేళ్ల క్రితం ప్రారంభించిన పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదని, ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ నుంచి హుస్నాబాద్ ద్వారా కరీంనగర్‌కు రాకపోకలు జరుగుతాయని, వందల సంఖ్యలో వాహనాలు ర్రాతింబవళ్లు నడుస్తాయన్నారు. ఇప్పటికై న అధికారులు చొరవ తీసుకొని పనులు త్వరగా పూర్తి చేయాలన్నా రు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన నాయకులు ఇరుగు సిద్దులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శా నబోయిన మహిపాల్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు దడిగ సందీప్‌యాదగిరి, దడిగ సిద్ధులు, తిరుపతి, గుర్రం నరేష్, శ్రవణ్, వెంకటేష్ పాల్గొన్నారు.
అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా