
రజకుల సమస్యలు పరిష్కరించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: రజక వృత్తిదారులు సమస్యలు పరిష్కంచాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పైళ్ళ ఆశయ్య అన్నారు. మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో ఆదివారం రజక వృత్తిదారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది మంది రజక వృత్తిదారులు రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా తీవ్రంగా వెనుకబడి ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో వివిధ చేతి వృత్తిదారులకు ఇచ్చిన హామీలను అమలులో రజకులను ఆర్థికంగా నిలబడటానికి ప్రతీఒక్కరికి రుణ సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామాల్లో కమ్యూనిటీ హాల్‌లు, దోబీ ఘాట్‌లు నిర్మించాలని, యాభై సంవత్సరాలు నిండిన వృత్తిదారులకు పెన్షన్ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదునూరి మధు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు పొన్నల రమేశ్, పద్మాకర్, భానుచందర్, రవి, వెంకటయ్య, సాంబయ్య, యాదగిరి, అశోక్, ఉపేందర్, పరశురాములు, రవి, కొండల్ తదితరులు పాల్గొన్నారు.
రజక వృత్తిదారుల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు ఆశయ్య