నత్తే నయం! | - | Sakshi
Sakshi News home page

నత్తే నయం!

Jul 6 2025 6:54 AM | Updated on Jul 6 2025 6:54 AM

నత్తే

నత్తే నయం!

జనగామ రూరల్‌: కేంద్ర ప్రభుత్వం రైల్వేస్టేషన్లను సుందరీకరించేందుకు అమృత్‌ భారత్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు కార్పొరేట్‌ స్థాయిలో మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో అమృత్‌ భారత్‌ పథకంలో జనగామ రైల్వేస్టేషన్‌కు చోటు కల్పించారు. 2023 ఆగస్టులో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా అభివృద్ధి పనులు ప్రారంభించగా, రెండేళ్లు కావస్తున్నా సుందరీకరణ పనులు నేటికీ పూర్తి కాలేదు. రాష్ట్రంలోని చర్లపల్లితో పాటు పలు మినీ స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి చేసుకుని కొత్త కళను సంతరించుకోగా, జిల్లాలో మాత్రం ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారిపోయాయి. స్టేషన్‌ అభివృద్ధి పనులకు రూ.100 కోట్ల నిధులను కేటాయించగా, మొదటి విడతలో రూ.24.50 కోట్ల నిధులను విడుదల చేశారు.

ఎక్కడి పనులు అక్కడే..

ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును తలదన్నే రీతిలో జనగామ రైల్వే స్టేషన్‌ నమూనాను డిప్లే చేయగా, అది చూసిన ప్రయాణికులు, ప్రజలు ఖుషీ అయ్యారు. మొదట్లో చకచకా సాగిన పనులు, ఆరు నెలల తర్వాత నత్తనడకన సాగుతున్నాయి. స్టేషన్‌ ముఖ ద్వారంతో పాటు ఫుట్‌పాత్‌, పార్కింగ్‌, గ్రీనరీ, టాయిలెట్స్‌ తదితర పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. మొదటి దశ పనులు పూర్తి చేసుకుని, రెండవ దశ సైతం ప్రారంభం కావాల్సిన దశలో మొదటికే మోక్షం కరువైపోయింది.

ప్రతిపాదించిన పనులు..

జనగామ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణకు మొదటి విడతలో మంజూరు చేసిన రూ.24.50 కోట్లతో స్టేషన్‌ ముఖద్వారం తుది మెరుగులు, కొత్తగా రెండవ ప్రవేశ ద్వారం ఏర్పాటుకు ప్రణాళిక చేశారు. అలాగే 12 మీటర్ల వెడల్పుతో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, ప్లాట్‌ఫాం అభివృద్ధితో పాటు అదనపు కవర్‌ను ఏర్పాటు చేయనున్నారు. మరుగుదొడ్లను మరింత మెరుగుపర్చి, కొత్తగా టాయిలెట్ల బ్లాకుల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే గదులకు కొత్త హంగులు సమకూరుస్తారు. స్టేషన్‌ ప్రాంగణంలో గ్రీనరీ, విశాలమైన పార్కింగ్‌, ప్రయాణికులకు అనుకూలమైన వాతావరణం కలిగించేలా స్టేషన్‌ అభివృద్ధికి ప్లాన్‌ చేసిన కేంద్రం, అందుకు తగ్గట్టుగా పనులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్లాట్‌ఫాంపై కోచ్‌ ఇండికేషన్‌ బోర్డుల ఏర్పాటు, క్వార్టర్లు, వెయిటింగ్‌ హాల్స్‌లో దోమల నివారణకు చర్యలు తీసుకోనున్నారు. లిఫ్టు, ఎస్కలేటర్‌, రైళ్ల రాకపోకల సమయంలో మరింత పకడ్బందీగా పర్యవేక్షణ ఉండేలా టెలికాం, సిగ్నల్స్‌ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. కానీ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం రెనోవేషన్‌ పనులు జరుగుతుండడంతో టికెట్‌ కౌంటర్‌తో పాటు రాకపోకలకు సంబంధించిన గేటును దారి మర్చారు.

ఆలస్యంగా రైల్వేస్టేషన్‌

సుందరీకరణ పనులు

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో రూ.100 కోట్లు మంజూరు

మొదటి విడతలో

రూ.24.50 కోట్లు విడుదల

ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు..

రూ.100 కోట్లతో రైల్వేస్టేషన్‌ అభివృద్ధి చేయనున్నారు. వందశాతం పనులు పూర్తయితే స్టేషన్‌ కార్పొరేట్‌ హంగులను సంతరించుకుంటుంది. ప్రస్తుతం పనులను పెండింగ్‌లో ఉంచడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ఏడాదిలోపే స్టేషన్‌కు కొత్త హంగులను తీసుకు వస్తామని అధికారులు చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయింది. ఇప్పటికై నా జాప్యాన్ని నివారించాలి.

–కాముని శ్రీనివాస్‌, యశ్వంతాపూర్‌

రెండో దశ ప్రారంభించాలి..

జనగామ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులకు సంబంధించి మొదటి విడత కంప్లీట్‌ చేసి, రెండవ దశ పనులను వెంటనే ప్రారంభించాలి. రెండేళ్ల నుంచి పనులు సాగుతూ ఉన్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు. పనుల పురోగతిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు దృష్టి సారించాలి.

– జోగు ప్రకాశ్‌, సీపీఎం పట్టణ కార్యదర్శి

నత్తే నయం!1
1/3

నత్తే నయం!

నత్తే నయం!2
2/3

నత్తే నయం!

నత్తే నయం!3
3/3

నత్తే నయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement