
ప్రజాధనం వృథా!
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu
జనగామ: లక్షలాది రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన మున్సిపల్ వాహనాలు తుప్పుబడుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టణ పర్యవేక్షణ గాలికి వదిలేయడంతో కాలనీల్లో మౌలిక వసతులు కరవయ్యాయి. గాడితప్పిన పురపాలికపై సాక్షి ప్రత్యేక కథనం.
జనగామ పురపాలికలో ప్రజాధనం అంటే లెక్క లేకుండా పోయింది. ఇంటి, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్‌లు, ఆయా మార్గాల్లో జరిమానాలు, నిర్మాణ సమయంలో అనుమతుల పేరిట ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుంది. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత నిధుల విడుదల చేస్తుంది. ఒక్కోపైసా ఖర్చు చేసే సమయంలో బాధ్యత ఉండాలి. అభివృద్ధి పనుల్లో నాణ్యత, ప్రజలకు సౌకర్యాలు కల్పించే సమయంలో మూణ్నాళ్ల పాటు బాగుండే విధంగా చూడాల్సిన బాధ్యత కమిషనర్‌పై ఉంటుంది. ఇక్కడ మాత్రం అవేమీ కనిపించవు. కమిషనర్ అజమాయిషీ లేకపోవడం, పరిపాలనపై అవగాహ న రాహిత్యంతో ప్రజలకు శాపంగా మారింది. సమస్యలపై ఫిర్యాదు చేస్తే రోజుల తరబడి తిరగడం తప్ప, ఒక్క పని జరిగిన దాఖలాలు లేవని పట్టణంలో చర్చ జరుగుతోంది. శానిటేషన్ నిర్వహణ, చెత్త సేకరణ కోసం లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి కొనుగోలు చేసిన వాహనాలను మూలన పడేశారు. రూ.10లక్షల విలువ చేసే ఆరు డంపర్లు తప్పు పట్టిపోతున్నా.. పట్టించుకోవడం లేదు. మరమ్మతు చేయిస్తే ఉపయోగంలోకి వచ్చే ట్రాక్టర్ ట్రాలీలు అక్కరకు రాకుండా పోతున్నాయి. జనరేటర్ ఎండకు ఎండుతూ, వానకు తడిసి పోతూ ఎందుకు పనికి రాకుండా పోతుంది. హైడ్రాలిక్ ఆటో, మరో ట్రాలీ, వీధుల్లో ఏర్పాటు చేసే చెత్త డబ్బాలు పిచ్చిమొక్కల మధ్య దర్శనమిస్తున్నాయి. అధికారులు కార్యాలయాలకు ఉపయోగించే ఏసీకి అనుసంధానంగా ఉండే ఇన్వర్టర్‌ను నిర్లక్ష్యంగా చెట్ల పొదల మధ్య ఏర్పాటు చేశారు. ఇన్వర్టర్‌లోకి పిచ్చిమొక్కలు వెళ్తూ.. వర్షంలో తడుస్తూ పాడై పోతుంది. లక్షల సొమ్ము మట్టి పాలు చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించమంటే నిధులు లేవని చెబుతున్న కమిషనర్ నిర్లక్ష్యంపై మెజార్టీ ప్రజలు మండిపడుతున్నారు.
మున్సిపల్ శానిటేషన్ విభాగం వాహనాలు
మూలకు పడిన వాహనాలివే
న్యూస్‌రీల్
తుప్పుపడుతున్న మున్సిపల్ వాహనాలు
వానకు తడుస్తూ..ఎండకు
ఎండుతున్న జనరేటర్
పట్టణ ప్రజలకు కనీస మౌలిక
వసతులు కరువు
పట్టించుకోని పురపాలిక అధికారులు
రాత్రి వేళలోనూ చెత్త సేకరణ
జనగామ: జనగామ పట్టణంలో పురపాలిక అధికారులు రాత్రి సమయంలో చెత్త సేకరణకు శ్రీకారం చుట్టారు. గాడితప్పిన శానిటేషన్ నిర్వహణపై ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలతో అధికారులు స్పందిస్తున్నారు. ప్రధా న రహదారులతో పాటు కమర్షియల్ వార్డుల్లో చెత్తను సేకరిస్తూ డంప్ యార్డుకు తరలిస్తున్నా రు. ఈ ప్రక్రియను మూణ్నాళ్ల ముచ్చటగా కా కుండా, నిరంతర ప్రక్రియగా ముందుగా సా గాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.
ఆటోలు: 10
ట్రాక్టర్లు:7
ప్రైవేట్ ఆటోలు: 5
జేసీబీ: 1
ఫాగింగ్ యంత్రాలు: 4
శానిటేషన్ కార్మికులు: 147
స్ప్రేయర్లు: 64
ట్రాలీ కం ఇంజిన్: 1
ట్రాక్టర్ ట్రాలీలు: 2
జనరేటర్: 1
డంపర్లు: 6
హైడ్రాలిక్ ఆటో: 1
ఆటో ట్రాలీ: 1

ప్రజాధనం వృథా!

ప్రజాధనం వృథా!

ప్రజాధనం వృథా!

ప్రజాధనం వృథా!