
ఈవీఎం గోదాం పరిశీలన
జనగామ రూరల్: ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కలెక్టరేట్‌లోని ప్రధాన ఈవీఓం గోదాంను కలెక్టర్ రిజ్వాన్ బాషా శనివారం పరిశీలించారు. ఈ మేరకు భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పరిశీలన, నియంత్రణ పద్ధతులను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హుస్సేన్, ఎన్నిక సంఘం సిబ్బంది పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు
జనగామ: జిల్లాలో ట్రిపుల్ ఐటీకి అర్హత సాధించిన 49 మంది విద్యార్థులను కలెక్టర్ రిజ్వాన్ బాషా శనివారం అభినందించారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీలో ఆరు సంవత్సరాల కోర్సుకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. పిల్లలు జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారన్నారు. కొడకండ్ల మండలంలోని 15, రఘునాథపల్లి 8, లింగాలఘణపురం, చిల్పూర్, జనగామ మండలం నుంచి ముగ్గురు చొప్పున ప్రవేశం పొందినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ కొడకండ్ల నుంచి అత్యధికంగా 8 మంది, ఆదర్శ పాఠశాల నుంచి 5 విద్యార్థులు ఎంపికలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు. భవిష్యత్తులో సాంకేతిక విద్య పొందడానికి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపించాలని, ప్రణాళిక బద్ధంగా బోధన చేస్తూ, పదో తరగతిలో మంచి ఫలితాలను రాబట్టి, ట్రిపు ల్ ఐటీ బాసరలో మరిన్ని సీట్లు పెరిగేలా చూ డాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ట్రిపుల్ ఐటీలో అవకాశం పొందిన ప్రతీ విద్యార్థిని అభినందిస్తూ, ఉపాధ్యాయుల కృషిని కీర్తించారు.