
అంగన్‌వాడీల బలోపేతానికి కృషి
జనగామ రూరల్:అంగన్‌వాడీల బలోపేతానికి కృషి చేయాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్ మోహితి అన్నారు. బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సిబ్బంది, డీసీపీయూ, చైల్డ్ హెల్ప్‌లైన్, సఖి సెంటర్, పోషణ అభియాన్, అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. గర్భిణులకు, చిన్నారులకు పౌష్టికాహా రం అందేలా చూడాలన్నారు. అంతకుముందు పట్టణంలోని అంబేడ్కర్‌నగర్, రఘునాథపల్లి మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలను పరి శీలించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు
అన్నిరంగాల్లో రాణించాలి
నర్మెట: విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ అన్నారు. మండలంలోని కస్తూ ర్భాగాంధీ బాలికల విద్యాలయం, నర్మెట గ్రామపంచాయతీని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీ పరిసరాలు, తరగతి గదులు, వంటశాల పరిశీలించిన అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలోని పలు రికార్డులు పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలను నిర్మించాలన్నారు. ఆయన వెంటన డీఈఓ భోజన్న, జీసీడీఓ గౌసియా బేగం, ఎంపీడీఓ అరవింద్ చౌదరి, ఎంఈఓ మడిపల్లి ఐలయ్య, ఎస్‌ఓ రజిత, కార్యదర్శి కందకట్ల శ్రీధర్, సిబ్బంది తదితరులున్నారు.
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
చిల్పూరు: ఫిర్యాదుదారులు ఇచ్చే దరఖాస్తులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సత్వరమే చర్యలు తీసుకోవాలని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేందర్ నాయక్ అన్నారు. చిల్పూరు పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్య క్తం చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్ర వర్తించాలన్నారు. కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నవీన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
గృహ నిర్మాణ శాఖ పీడీగా హనుమా
జనగామ: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్‌డీసీ–2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న వి.హనుమాకు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుంచి రిలీవ్ అయి, కొత్త పో స్టులో జాయినింగ్ తేదీని ప్రభుత్వానికి తెలియ పర్చాలని అందులో పేర్కొన్నారు.
తహసీల్దార్లు, నాయబ్
తహసీల్దార్ల బదిలీలు
జనగామ: జిల్లాలో నలుగురు తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేయడంతో పాటు పోస్టింగ్‌లు ఇస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రఘునాథపల్లి తహసీల్దార్ ఎండీ మొహ్సిన్ ముజ్తభాను నర్మెటకు, నర్మెటలో పని చేస్తున్న తహసీల్దార్ రామానుజాచారికి బచ్చన్నపేటకు పోస్టింగ్ కల్పిస్తూ ఆర్డర్ ఇచ్చారు. బచ్చన్నపేటలో ఇన్‌చార్జ్ తహసీల్దార్‌గా పని చేస్తున్న నాయబ్ తహసీల్దార్ ఎల్.ఫణికిషోర్ రఘునాథపల్లికి బదిలీ చేయడంతో పాటు తహసీల్దార్‌గా అదనపు పూర్తి బాధ్యతలను అప్పగించారు. రఘునాథపల్లి నాయబ్ తహసీల్దార్‌గా పని చేస్తున్న సుంచు శంకర్ జనగామ ఆర్డీఓ కా ర్యాలయానికి బదిలీ కాగా, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కలెక్టరేట్‌లో డిప్యూటేషన్ పై పని చేస్తారన్నారు. బదిలీ అయిన తహసీల్దా ర్లు, నాయబ్ తహసీల్దార్లు వెంటనే విధుల్లో చే రాలని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అంగన్‌వాడీల బలోపేతానికి కృషి