
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
జగిత్యాల: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 41వ వార్డులో రూ.25లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించారు. నాణ్యతతో కూడిన పనులను చేపట్టాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని పనుల్లో ఇష్టానుసారంగా చేస్తున్నారని, అధికారులు పనులను పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ఉన్నారు.
పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి
కథలాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి తెలిపారు. కథలాపూర్‌లో బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం నిధులతో కథలాపూర్ మోడల్‌స్కూల్‌లో కిచెన్‌షెడ్ నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. సిరికొండ, ఇప్పపెల్లి, దుంపేట, చింతకుంట, అంబారిపేట తండాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ షెడ్ల కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరయ్యాయన్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ఈ నిధులను మంజూరు చేశారన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, నాయకులు సత్యనారాయణ, వెంకటేశ్వర్‌రావు, శ్రీనివాస్, మహేశ్, రవి, సత్యం, రాజేశ్, శివ, శ్రీహరి పాల్గొన్నారు.
ఈ పాస్ ద్వారానే అమ్మకాలు
కోరుట్ల రూరల్: ఈ పాస్ ద్వారానే యూరియా అమ్మకాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ సూచించారు. కోరుట్ల మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. యూరియా లారీ వచ్చిన వెంటనే గోదాముల్లో దింపి రైతు భూమి వివరాల ప్రకారం యూరియా ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ దండ రమేశ్, ఏవోలు నాగమణి, లావణ్య, రాజ్‌కుమార్, దీపిక పాల్గొన్నారు.
దరఖాస్తులకు ఆహ్వానం
జగిత్యాల: సివిల్ సర్వీసెస్ పరీక్ష (ప్రీలిమ్స్, మెయిన్స్) 2025–26 కోసం ఉచిత లాంగ్‌టర్మ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. జిల్లాలోని డిగ్రీ పాస్ అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థుల సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జూలై 8 వరకు సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, జూలై 25 నుంచి 2026 ఏప్రిల్ 30 వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. 150 మంది అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వనుండగా, 100 మందిని జూలై 12న నిర్వహించే ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారని, మరో 50 మంది అభ్యర్థులను ఇంతకుముందు యూపీఎస్సీ ద్వారా నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని నేరుగా తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఉచిత రవాణా, భోజన, లాడ్జింగ్ కోసం నెలకు రూ.5 వేలు, బుక్‌ఫండ్ కోసం రూ.5 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వివరాలకు 0878–2268686 నంబరులో సంప్రదించాలన్నారు.
సమ్మె నోటీసు అందజేత
జగిత్యాలరూరల్: గ్రామపంచాయతీ కార్మిక సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటి చంద్రశేఖర్ అన్నారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే ఒక రోజు సమ్మెలో పంచాయతీ కార్మికులు పాల్గొంటారని శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి మదన్‌మోహన్‌కు సమ్మె నోటీసు అందజేశారు. జిల్లా కార్యదర్శి మల్లేశం, న్యాతరి మల్లవ్వ, మండల అధ్యక్షుడు రాజేందర్, రాజన్న, రాజు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి