అవసరమైతే చైనాతో అన్నీ బంద్: ట్రంప్‌

Trump Says US Could Decouple With China And Not To Do Business - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనాపై కత్తులు నూరారు. అవసరమనుకుంటే చైనాతో అన్ని వ్యాపార సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరించారు. చైనా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడకుండా జాగ్రత్త పడతామని ఫాక్స్‌ న్యూస్‌ ఇంటర్వ్యూలో శనివారం పేర్కొన్నారు. కాగా, అమెరికా ఉత్పత్తులకు చైనా అతిపెద్ద దిగుమతిదారు అన్న సంగతి తెలిసిందే. ‘చైనాతో వ్యాపారం చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే మేము సరైన భాగస్వామి అని చైనా అనుకోవండం లేదు. అందుకే మేము కూలా అలానే ఆలోచిస్తున్నాం’అని ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా, జనవవరిలో మొదటి దశ వాణిజ్య ఒప్పందాల సమయంలో ట్రంప్‌ చైనాతో ట్రేడ్‌ వార్‌కు తెర తీశారు. (చదవండి: చీకటి నుంచి వెలుగులోకి)

చైనా నుంచి దిగుమతులపై టారిఫ్‌లు పెంచడంతో షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం కూడా దీటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండగానే కరోనా మహమ్మారి ప్రపంచదేశాలపై విరుచుకుపడింది. ముఖ్యంగా అమెరికా తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో కరోనా వైరస్‌పై అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని, ఆ దేశం చర్యలపట్ల అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ రెండో దశ వాణిజ్య చర్చలకు విముఖత చూపారు. ఇదిలాఉండగా.. చైనాలో అమెరికా తయారీ సంస్థలకు న్యాయమైన, స్థాయి ప్రాతిపదికన పోటీకి అవకాశాలు లభించకపోతే.. యూఎస్‌, చైనా ఆర్థిక వ్యవస్థలు వేరుపడక తప్పదని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్‌ మునుచిన్‌ జూన్‌లో పేర్కొనడం గమనార్హం. (చదవండి: వ్యాక్సిన్‌ తయారీలో చైనా దూకుడు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top