Live Updates
యుద్ధంపై ఇరాన్ రెడ్‌క్రిసెంట్ సంస్థ రిపోర్ట్.. నష‍్టం ఎంతంటే..?
యుద్ధంపై ఇరాన్ రెడ్‌క్రిసెంట్ సంస్థ రిపోర్ట్
- యుద్ధంపై ఇరాన్ రెడ్‌క్రిసెంట్ సంస్థ రిపోర్ట్
- లక్షా 15 వేలకుపైగా భవనాలు ధ్వంసం
- రాజధాని టెహ్రాన్‌లోనే ఎక్కువ నష్టం
- శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డ 1526 మంది
2026-04-01 20:36:27
ప్రధాని అధ్యక్షతన భద్రత వ్యవహారాల కేబినెట్ భేటీ ప్రారంభం
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రత వ్యవహారాల కేబినెట్ భేటీ ప్రారంభం
- ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను సమీక్షించనున్న సీసీఎస్
2026-04-01 19:56:48
ఇరాన్ కొత్త పాలకుడు కాల్పుల విరమణ కోరారు: ట్రంప్
- ఇరాన్ కొత్త పాలకుడు కాల్పుల విరమణ కోరారు: ట్రంప్
- పాతపాలకుడితో పోలిస్తే కొత్త పాలకుడు కొంతనయం
- హర్మూజ్ జలసంధి తెరిస్తే.. కాల్పుల విరమణ పరిశీలిస్తాం
- హర్మూజ్ తెరిచే వరకు ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తాం
2026-04-01 19:52:17
ట్రంప్‌కు మరోసారి బ్రిటన్ ప్రధాని షాక్
- ఎంత ఒత్తిడి చేసినా యుద్ధంలో పాల్గొనే ప్రసక్తేలేదు: బ్రిటన్ ప్రధాని స్టార్మర్
- మాకు బ్రిటన్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం
- పశ్చిమాసియా యుద్ధంతో మాకు సంబంధం లేదు
- హర్మూజ్ సంక్షోభాన్ని నివారించడానికి కావాలంటే మధ్యవర్తిత్వం వహిస్తాం
2026-04-01 16:13:02
నాటో నుంచి వైదొలిగే యోచనలో అమెరికా
- నాటో నుంచి వైదొలిగే యోచనలో అమెరికా
- నాటో నుంచి తప్పుకునే అంశాన్ని పరిశీలిస్తుమన్నా ట్రంప్
- 'ది టెలిగ్రాఫ్' పత్రిక ఇంటర్వ్యూలో ట్రంప్
2026-04-01 15:52:57
వ్యవస్థీకృతంగా క్షిపణి దాడులు?
- పౌర ప్రాంతాల్లో క్షిపణి దాడులకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ క్షిపణి కమాండ్ ఆదేశం?
- క్షిపణి దాడులు వ్యవస్థీకృతంగా జరుగుతున్నాయని ఇరాన్ ఇంటర్నేషనల్ రిపోర్టు
- ఇరాన్ , హిజ్బుల్లాతో కలిసి ఇజ్రాయెల్‌పై సంయుక్త దాడి చేసినట్లు హౌతీల ప్రకటన
- సంఘర్షణల మధ్య పెరిగిన చమురు ధరలు తగ్గుముఖం.
- ఇరాన్ యుద్ధాన్ని ముగించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపుతో చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.
2026-04-01 12:48:02
ఇరానీయులపై యూఏఈ నిషేధం
- ఇరానీయులు దేశంలోకి ప్రవేశించకుండా యూఏఈ నిషేధం.
- ఎమిరేట్స్, ఎతిహాద్, ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థల కీలక ప్రకటన.
- యూఏఈలోని వ్యవసాయ క్షేత్రంపై డ్రోన్ శకలాలు పడి బంగ్లాదేశ్ జాతీయుడు మృతి.
2026-04-01 11:34:54
యెమెన్ బాలిస్టిక్ క్షిపణి విధ్వంసం
- ఇజ్రాయెల్ దిశగా దూసుకెళ్లిన యెమెన్ బాలిస్టిక్ క్షిపణి
- ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన క్షిపణులను గుర్తించాం: ఇజ్రాయెల్ సైన్యం
- ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు: అల్ జజీరా
2026-04-01 10:52:38
10 మంది ఇరాన్ నర్సులు మృతి
- టెహ్రాన్‌లో అమెరికా-ఇజ్రాయెల్ దాడులు
- 10 మంది ఇరాన్ నర్సులు మృతి
- సర్వీసులో ఉన్న ప్రదేశంలోనే మృతి
- దాడులు జరిగినప్పటికీ ఆ ప్రదేశంలో పనిచేస్తున్న సిబ్బంది
- అంతరాయం లేకుండా కొనసాగుతున్న వైద్య సేవలు
2026-04-01 10:01:54
టెహ్రాన్‌లో పెద్ద ఎత్తున పేలుళ్లు
- సెంట్రల్ టెహ్రాన్‌లో పెద్ద ఎత్తున పేలుళ్లు
- గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసిన ఇరాన్
- పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు సమాచారం
2026-04-01 08:23:00
మనం యుద్ధం ముగింపు దశను చూస్తాం: మార్కో రూబియో
- అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కామెంట్స్
- ఇరాన్‌తో ఐదో వారం కొనసాగుతున్న యుద్ధం
- మనం యుద్ధం ముగింపు దశను చూస్తాం
- నేడో, రేపో కాదు.. కానీ, త్వరలోనే చూస్తాం
- ఎప్పుడో ఒక సమయంలో ఇరాన్ అధికారులతో నేరుగా సమావేశం జరగొచ్చు
2026-04-01 07:18:07
త్వరలోనే మా ఆపరేషన్ పూర్తవుతుంది: ట్రంప్
- ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా సిద్ధం?
- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్
- ఇరాన్‌లో మా ఆపరేషన్ త్వరలోనే పూర్తవుతుంది
- ఇరాన్‌ను రెండు-మూడు వారాల్లో విడిచి వెళ్తాం: ట్రంప్
2026-04-01 07:03:07
Advertisement


