ట్రంప్‌కు ఇండోనేషియా షాక్‌.. డబ్బులిచ్చేది లేదు? | Indonesia says it wont pay 1 billion fee | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు ఇండోనేషియా షాక్‌.. డబ్బులిచ్చేది లేదు?

Mar 23 2026 11:40 PM | Updated on Mar 24 2026 12:44 AM

 Indonesia says it wont pay 1 billion fee

పశ్చిమాసియా యుద్ధంతో సతమతమువుతున్న ట్రంప్‌కు  ఇండోనేషియా షాక్ ఇచ్చింది. ఇటీవల  గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన 'బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌' మిషన్‌కు ఎటువంటి ఆర్థిక మద్ధతు అందించలేదని తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రస్తుతం అనేక సమస్యలు వేదిస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధం కొద్దిరోజుల్లోనే ముగిద్దామనుకున్న ట్రంప్‌కు చుక్కెదురైంది. ఇరాన్ ఎంతకూ లొంగకపోవడంతో చేసేదేం లేక తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇ‍ప్పుడు ఆయనకు మరో చిక్కు వచ్చి పడింది. ఇటీవల ట్రంప్‌ ఏర్పాటు చేసిన బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌ మిషన్‌లో చేరడానికి సభ్యత్వ రుసుమును చెల్లించేది లేదని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో స్పష్టం చేశారు.

ఆదివారం ఇండోనేషియా అధ్యక్షుడి ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా మిషన్ కోసం జకార్తా కేవలం ఎనిమిది వేల మంది శాంతి పరిరక్షక దళాలను మాత్రమే కేటాయించిందని ఎటువంటి సభ్యత్వ రుసుము చెల్లించేది లేదని తెలిపారు. కాగా ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా మిషన్‌లో చేరినందుకు ఇండోనేషియా ముస్లిం ప్రజల నుంచి ప్రభోవో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ రుసుము చెల్లించడానికి విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  

డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో   గాజా ప్రాంతాన్ని రాజకీయంగా, ఆర్థికంగా పూర్తిగా ప్రక్షాళన చేయడం కోసం  బోర్డ్‌ ఆఫ్ పీస్ మిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  

 

Advertisement
 
Advertisement
Advertisement