
ఇంతవరకు ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన కొన్ని విషయాలను కథలు కథలుగా విన్నాం. రష్యా అధ్యక్షుడి దురాక్రమణను తిప్పికొట్టేలా సామాన్యులు సైతం ఆయుధాలను చేతబట్టి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచారు. మరికొంతమంది రష్యా యుద్ధ ట్యాంకుల ఎదుట ధైర్యంగా నిలబడి తమ దేశంలోకి రావద్దంటూ నినాదలు చేశారు. అంతేకాదు 98 ఏళ్ల వృద్ధ మహిళ తన మనవరాళ్ల బావి భవిష్యత్తు కోసం ఉక్రెయిన్ సైన్యంలో చేరడానికి ముందుకు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రెండోవ ప్రపంచ యుద్ధ అనుభవాన్ని గడించిన 98 ఏళ్ల ఓల్హా ట్వెర్డోఖ్లిబోవా సైతం ఉక్రెయిన్ యుద్ధంలోకి పాల్గొనేందుకు ముందుకు వచ్చింది. ఉక్రెయిన్ ప్రజల దేశభక్తిని చూసి ప్రపంచ దేశాలన్నీ నివ్వెరపోయాయి. ఇవన్నీ ఒకత్తెయితే సమాజంలో సరైన గుర్తిపు లేక చిత్కారాలకు గురవుతున్న స్వలింగ సంపర్కులు సైతం యుద్ధంలో పాల్లొని అందరి చేత హ్యట్సాఫ్ అనిపించుకున్నారు.
వివరాల్లోకెళ్తే...ఒలెక్సాండర్ జుహాన్, ఆంటోనినా రొమానోవా అనే స్వలింగ సంపర్కుల జంట ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలవక ముందు ఒక థియెటర్‌లో పనిచేసేవారు. నిజానికి ఈ జంట 2014లో రష్యా ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంపై దండయాత్ర చేసి బలవంతంగా క్రిమియాను ఆక్రమించిన సమయంలో పారిపోయి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కి తరలి వచ్చారు. ఆ సమయంలో ఈ జంట చాలా సమస్యలను ఎదుర్కొంది. చిన్నచితక పనులు చేసుకుంటూ జీవనం సాగించామన్నారు. ఇంతలో రష్యా ఉక్రెయిన్‌పై దాడులు దిగడంతో తాము ప్రాణాల రక్షణకై బాంబు షెల్టర్‌లో కొన్నాళ్లు తలదాచుకున్నామని చెప్పారు.
ఐతే ఆ జంట ఆ సమయంలో తమ ముందు మూడు ఆప్షన్‌లే కనిపించాయని అవి ఒకటి బాంబు షెల్టర్‌లో ఉండటం, రెండు తప్పించుకోవడం, మూడు సైన్యం చేరడం అని చెబుతున్నారు. కానీ తాము మూడో ఆప్షన్‌నే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. రష్యన్లు ఉక్రెయిన్లను మాత్రమే చంపడం లేదని ఉక్రెయిన్ దేశ సంస్కృతిని కూడా నాశనం చేస్తున్నారంటూ ఆవేదనగా చెప్పుకొచ్చారు. అంతేకాదు తాము సైన్యంలో స్వలింగ సంపర్కులుగా వివక్షతను ఎదుర్కొవల్సి ఉంటుందేమోనని చాలా ఆందోళన చెందామని కూడా వివరించారు.
అదృష్టవశాత్తు అలాంటి వివక్షతను ఏమి ఎదురవలేదని, విజయవంతంగా తొలి యుద్ధ పర్యటనను ముగించామని అన్నారు. తాము మే నెల నుంచి కాస్త విరామం తీసుకుని తిరిగి గత నెల 25 నుంచి యథావిధిగా సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు వారికి ఆయుధాలను ఉపయోగించిన అనుభవం కూడా లేదు అయినా సైన్యంలో చేరి సేవలందించడం విశేషం.
(చదవండి: పాప్ బ్యాండ్ బీటీఎస్‌తో సమావేశమైన బైడెన్: వీడియో వైరల్)