Massive Tornado: అమెరికాలో టోర్నడోల విధ్వంసం..23 మంది మృతి

Few Dead After Massive Tornado Tears Through US Town - Sakshi

అమెరికాలో కనివినీ ఎరుగని విధంగా టోర్నోడోలు పెను విధ్వంసం సృష్టించాయి. ఈ మేరకు మిస్సిస్సిపిలో శుక్రవారం అర్థరాత్రి బలమైన గాలులు, ఉరుములతో కూడిన తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో పరిసర ప్రాంతాలన్ని చిగురుటాకులా వణికిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 23 మంది దాక ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది జనాలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ టోర్నోడోల కారణంగా భారీ నష్టం జరిగిందని సుమారు 160 కి.మీ వరకు ప్రభావం చూపిందని అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది.

ఈ టోర్నడో విధ్వంసం అనంతరం రెస్క్యూ బృందాలు, అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ వెస్ట్రన్‌ మిస్సిస్పిప్పిలోని సిల్వర్‌సిటీలో దాదాపు 200 మంది నివశిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ తుపాను తర్వాత ప్రాణాలతో బయటపడిన వారి ఆచూకి కోసం రెస్కూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఐతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని చెప్పారు. మరోవైపు ఈ విధ్వంసం తర్వాత సుమారు నలుగురు వ్యక్తులు తప్పిపోయినట్లు మిస్సిస్సిప్పి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ వరుస ట్వీట్‌లలో తెలిపింది.

అలాగే సమీపంలోని మరోప్రాంతం..  సుమారు 17 వందల మంది జనాభా ఉన్న రోలింగ్ ఫోర్క్‌ కూడ తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ కూడా  సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లు చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే స్థానికులు మాత్రం ఇలాంటి టోర్నడోలను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. ఈ తుపాను కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో శుక్రవారం రాత్రంతా జనం అంధకారంలోనే మగ్గిపోయారు. అలాగే ఈ ఘటనలో గాయపడ్డవారిని అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ టోర్నడాల కారణంగా పలు భవనాలు, వాహనాలు దారుణంగా దెబ్బతిన్నాయి.

(చదవండి: గర్లఫ్రెండ్‌కి సాయం చేయాలన్న ఇంటెన్షనే పోలీసులకు పట్టించింది..చివరికి..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top