మరో వివాదంలో ట్రంప్ : ఎవరా మహిళ?

 Fake Melania Trump conspiracy spread by online - Sakshi

కాన్సిపిరసీ థియరీ :  ఆన్ లైన్ ట్రోల్స్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ కు దొరికి పోయారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. తన ప్రత్యర్థి, డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో మెలానియాకు డూప్‌ను వెంటబెట్టుకుని తిరుగుతున్నారన్న తాజా వివాదం వైరల్ అవుతోంది. (ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్)

వివరాల్లోకి వెళితే గతకొన్ని రోజులుగా ట్రంప్ తన వెంట మెలానియాను పోలి ఉన్న మరో మహిళను తీసుకెడుతున్నారంటూ  సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు, మీమ్స్  హల్ చల్ చేస్తున్నాయి. ఈ అజ్ఞాత మహిళకు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెల 22వ తేదీన టెన్నెస్సె స్టేట్‌లోని నాష్‌విల్లేలోని యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన డిబేట్‌కు హాజరు కావడానికి ట్రంప్ తన అధికారిక నివాసం వైట్‌హౌస్ నుంచి మెరైన్ వన్ ఎయిర్ క్రాఫ్ట్‌లో బయలుదేరడానికి ముందు తీసిన ఫొటో తాజా వివాదానికి కారణమైంది. ఎయిర్ క్రాఫ్ట్‌లోకి అడుగు పెట్టడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ తన అభిమానులకు అభివాదరం చేస్తోన్న సమయంలో ఆయన పక్కనే నిల్చుని కనిపించారామె. ఈ ఫోటోలను పరిశీలించిన వారు ఆమె మెలానియా కాదని, మరో మహిళ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఎవరా ఆ అజ్ఞాత మహిళ అంటూ ‘ఫేక్ మెలానియా’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్యాగ్ చేస్తున్నారు. మరోవైపు గుర్తు తెలియని మహిళను తన భార్యగా ప్రపంచానికి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు మండిపడుతున్నారు. 

కాగా డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య ప్రథమ మహిళ మెలానియీ ఇటీవల కరోనా బారిన పడ్డారు. అయితే మిలటరీ ఆసుపత్రిలో చికిత్స  అనంతరం కోలుకున్న ట్రంప్ ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు.  విపరీతమైన దగ్గు కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కీలకమైన సమావేశానికి హాజరు కాలేకపోతున్నారంటూ ఆమె ప్రతినిధి వెల్లడించిన సంగతి తెలిసిందే.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top