VIDEO: బాబోయ్‌ అంత పెద్ద కొండచిలువనా? ఈ వైరల్‌ వీడియో వెనుక కథేంటంటే..

Fact Check On Crane Lifts Giant Phython Viral Video - Sakshi

FactCheck On Giant Phython Crane Video: ‘‘7కొండల్లో 32అడుగుల కొండచిలువ. తిరుమలలో పాపవినాశనం వెళ్ళే దారిలో అతిథిగృహం నిర్మాణం కోసం స్థలం పరిశుభ్రం చేస్తుంటే 32 అడుగుల కొండచిలువ కనబడింది’’.. అంటూ ఫేస్‌బుక్‌లో కొందరి అకౌంట్ల నుంచి ఓ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అఫ్‌కోర్స్‌.. ఈ ప్రచారం ఫేక్‌ అని తెలిసిందే. అయితే సోషల్‌ మీడియాలో  ఏ వీడియో ఎప్పుడు వైరల్‌ ఎప్పుడు.. ఎందుకు అవుతుందో? అందులో ఎంత వాస్తవం ఉందనేది కనిపెట్టడమూ ఈమధ్య కాలంలో కొంచెం కష్టంగా మారిందనుకోండి. అసలు విషయంలోకి వెళ్తే..
 

భారీ సైజులో ఉన్న కొండచిలువను క్రేన్‌ అమాంతం ఎత్తేసిన వీడియో గత వారం రోజులుగా ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో ఎక్కడిదన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది.  అయితే తాజా వీడియో మాత్రం మన దేశంలోదే కాదన్న విషయం వెలుగు చూసింది. వీడియో  ఇమేజ్‌ ద్వారా రివర్స్‌ చెక్‌ ఆప్షన్‌తో ఈ వీడియోకు సంబంధించి కొన్ని వివరాలు సేకరించాం.  

అక్టోబర్‌ 12న ‘టమన్‌ పెండిడికన్‌’(tamanpendidikan) అనే వెబ్‌సైట్‌ ద్వారా ఈ వీడియో గురించి మొదటి పోస్ట్‌ పడింది. అయితే పోస్ట్‌లోని భాష ఆధారంగా ఆ వెబ్‌సైట్‌ ఇండోనేషియన్‌ వెబ్‌సైట్‌గా నిర్ధారణ అయ్యింది. అదేరోజు ఓ ఇండోనేషియన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో కూడా అప్‌లోడ్‌ అయ్యింది.

ఆ తర్వాత ఇది ఇండోనేషియాకు చెందినది కాదని..  మలేషియాకు సంబంధించిన వీడియో అని ప్రచారం మొదలైంది. ఆ వెంటనే ఈ భారీ కొండచిలువ చైనా-మయన్మార్‌ బార్డర్‌లో దొరికిందని, కాదు.. మేఘాలయాకు చెందినది అని,  కాదు కాదు.. ఈ వీడియో జార్ఖండ్‌ ధన్‌బాద్‌(మనదేశం)లోనిదేనంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే కొన్ని హిందీ వెబ్‌సైట్లు ఇది అసలు మన దేశంలో కాదనే విషయాన్ని ఫ్యాక్ట్‌చెక్‌ ద్వారా నిర్ధారణ చేశాయి. అసలు ఇంతకీ ఈ వీడియో కొత్తదేనా? లేదంటే పాతదా? అనే విషయం కూడా తేలాల్సి ఉంది.

ఏది ఏమైనప్పటికీ గతంలో ఇలా భారీ పాములు కనిపించిన సందర్భాల్లో చంపిన దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో ఆ భారీ పామును ప్రాణాలతో ఉంచారా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జంతు పరిరక్షణ సంఘాలవాళ్లు. ప్రస్తుతానికి ఈ వీడియో యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ స్టేటస్‌లతో ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్‌ చేస్తోంది.

చదవండి: ఒకటి కాదు.. రెండు ప్రాణాలు కాపాడిన పోలీసాయన(VIRAL)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top