‘400 సీట్లు ఇలాగే దాటుతుంది’.. పాత వీడియో మళ్లీ వైరల్‌ | Sakshi
Sakshi News home page

‘400 సీట్లు ఇలాగే దాటుతుంది’.. పాత వీడియో మళ్లీ వైరల్‌

Published Fri, Apr 26 2024 1:25 PM

Old Video Falsely Linked To 2024 Lok Sabha Polls

న్యూఢిల్లీ: ఓటింగ్ సమయంలో ఓ మహిళా పోలింగ్ ఏజెంట్‌ ఇద్దరు మహిళలను ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించినదే ఈ వీడియో అంటూ వైరల్‌గా మారింది.

ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని సూచించే క్యాప్షన్‌లతో యూజర్లు వీడియోను షేర్ చేశారు. దీనిపై వార్తా ఏజెన్సీ పీటీఐ ఫాక్ట్ చెక్ చేసింది. ఇందులో ఈ వీడియా 2019 ఎన్నికల నాటిదని తేలింది. ప్రస్తుతం జరుగుతన్న ఎన్నిలకు సంబంధించిన వీడియో అంటూ తప్పుదారి పట్టిస్తూ సోషల్ మీడియాలో రీసెంట్‌గా షేర్ చేసినట్లు కనుగొంది.

ఏప్రిల్ 23న ఓ ఫేస్‌బుక్ యూజర్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు సబంధించినదని పేర్కొన్నారు. "400 సీట్లు ఇలాగే దాటుతుంది" అంటూ దానికి క్యాప్షన్‌ రాసుకొచ్చారు. దీనిపై ఫ్యాక్ట్‌ చెక్‌ చేపట్టిన పీటీఐ ఇది 2019 మే 18న పశ్చిమ బెంగాల్‌లో ఓ పోలింగ్‌ కేంద్రంలో తీసినదిగా తేల్చింది.

Advertisement
Advertisement