ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌ చట్టవిరుద్ధం.. తక్షణమే రిలీజ్‌ చేయండి: పాక్‌ సుప్రీం కోర్టు

Big Relief For Imran Khan At Pakistan Supreme Court - Sakshi

ఇస్లామాబాద్‌: పీటీఐ అధినేత, పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు పాకిస్తాన్‌ సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయన అరెస్ట్‌ను చట్టవిరుద్ధమైందిగా తేల్చిన సుప్రీం కోర్టు.. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని గురువారం సాయంత్రం ఆదేశించింది. 

అంతకు ముందు.. ఇమ్రాన్‌ ఖాన్‌ను గంటలోపు తమ ఎదుట ప్రవేశపెట్టాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. దర్యాప్తు సంస్థ నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరోను ఆదేశించింది. దీంతో.. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇమ్రాన్‌ ఖాన్‌కు కోర్టుకు తీసుకొచ్చారు. అయితే ఆయన అరెస్ట్‌లో నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో వ్యవహరించిన తీరును ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. విచారణకు హాజరైన ఇమ్రాన్‌ ఖాన్‌ను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్‌ చేశారని మండిపడింది.

అల్‌ ఖాదీర్‌ ట్రస్ట్ ల్యాండ్‌కు సంబంధించిన కేసులో ఇస్లామాబాద్‌ హైకోర్టు విచారణకు హాజరైన ఇమ్రాన్‌ ఖాన్‌ను.. అటు నుంచి అటే అరెస్ట్‌ చేసింది. ఈ క్రమంలో నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో ఎనిమిది రోజుల విచారణకు ఇమ్రాన్‌ ఖాన్‌కు కస్టడీకి తీసుకుంది కూడా. మరోవైపు ఖాన్‌ అరెస్టును ఖండిస్తూ.. పాక్‌లో అల్లర్లు హింసకు పాల్పడ్డారు పీటీఐ కార్యకర్తలు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు జోక్యం ద్వారా పరిస్థితి కాస్త చల్లబడినట్లయ్యింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top