కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలివ్వాలి
కాజీపేట రూరల్: ‘ఈ ప్రాంత అభివృద్ధి కోసం, కా జీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీలో స్థానికులకు 80 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలి, కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలి. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రంతో మాట్లాడి ఒత్తిడి తీసుకురావాలి’ అని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే స్టేషన్ ఎదుట శుక్రవారం సాయంత్రం వినయ్‌భాస్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ చేసిన ఎన్నో ఉద్యమాల ఫలితంగా 2023లో ప్రధాని నరేంద్రమోదీ కోచ్‌ప్యాక్టరీకి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 80 శాతం ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ ఏర్పాటు విషయంపై శని వారం కాజీపేట చౌరస్తాలో ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్ నర్సింగరావు, నాయకులు యాదవరెడ్డి, రమే ష్, కృష్ణ, రజినీకాంత్, రాంమూర్తి, దశరథం, రాజు, కృష్ణ, శివకుమార్, కనకరాజు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్
నేడు కాజీపేట చౌరస్తాలో ధర్నా


