ఆర్ట్స్‌ కళాశాల మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

ఆర్ట్స్‌ కళాశాల మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

ఆర్ట్

ఆర్ట్స్‌ కళాశాల మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని యూని వర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లోని మొదటి సెమి స్టర్‌ పరీక్షల ఫలితాలను ఆ కళాశాల ప్రిన్సిపా ల్‌ ఎస్‌.జ్యోతి సోమవారం విడుదల చేశారు. మొత్తం 1,445 మంది విద్యార్థులు పరీక్షలు రా యగా అందులో 482 మంది (33.35శాతం) ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చునని, మార్చి 9వతేదీవరకు గడువు ఉందన్నారు. ఫలితాలు సంబంధిత నోటీస్‌బోర్డుతో పాటు కళాశాల వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్‌ రెహమాన్‌, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

కేయూ పీజీ మొదటి సెమిస్టర్‌

పరీక్షలు వాయిదా

ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌ సోమవారం రాత్రి ప్రకటించారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ నాన్‌ప్రొఫెషనల్‌కోర్సులతోపాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల పరీక్షలు కూడా వాయిదావేసినట్లు తెలిపారు. పలు విభాగాల్లో సిలబస్‌ పూర్తికాని నేపథ్యంలో వాయిదావేసినట్లు పేర్కొన్నారు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించే తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని రాజేందర్‌ చెప్పారు.

ఘర్షణ పడిన విద్యార్థుల హాస్టల్‌ అడ్మిషన్‌ రద్దు యోచన?

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో న్యూపీజీ బాయ్స్‌ హాస్టల్‌లో ఎంబీఏ, ఎంఏ ఎకనామిక్స్‌ విభాగాల విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్న ఘటనను వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం సీరియస్‌గా పరిగణిస్తున్నారు. చికెన్‌ కోసం జరిగిన ఈ ఘర్షణలో 20మందిపై పోలీస్‌ కేసు కూడా నమోదైంది. ఆ రెండు విభాగాల పలువురు విద్యార్థులు ఆ మెస్‌ కమిటీ మెంబర్లుగా ఉన్నారు. గొడవ జరిగినప్పుడు తీసిన వీడియోలను పరిశీలించనున్నట్లు కేయూసీ సీఐ రవికుమార్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం వివిధ విద్యార్థి సంఘాలతో వీసీ, రిజిస్ట్రార్‌, సీఐ సమావేశమై చర్చించారు. కాగా, కేసులు నమోదైన విద్యార్థులను న్యూపీజీబాయ్స్‌ హాస్టల్‌నుంచి అడ్మిషన్‌ రద్దుచేయాలనే యోచనలో యూనివర్సిటీ అధికా రులు ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని వివరాలు సేకరించాక పోలీస్‌ కేసులను బట్టి నిర్ణయం తీసుకుంటామని కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య రామచంద్రం సోమవారం రాత్రి వెల్లడించారు. అవసరమైతే అకడమిక్‌ పరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదన్నారు.

లోకోపైలెట్‌కు అస్వస్థత

కాజీపేట రూరల్‌ : రైలులో ఓ లోకోపైలెట్‌ సోమవారం అస్వస్థతకు గురి కాగా కాజీపేట జంక్షన్‌లో దింపి చికిత్స నిమిత్తం రైల్వే ఆస్పత్రికి తలించారు. యశ్వంత్‌పూర్‌–నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వర్తిస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన లోకోపైలెట్‌ ప్రసాద్‌ మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సికింద్రాబాద్‌ రైల్వే అధికారులకు స మాచారం అందించి కాజీపేట జంక్షన్‌లో దింపారు. అనంతరం కాజీ పేట రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు.

ఆర్ట్స్‌ కళాశాల మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల 
1
1/2

ఆర్ట్స్‌ కళాశాల మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ఆర్ట్స్‌ కళాశాల మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల 
2
2/2

ఆర్ట్స్‌ కళాశాల మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

Advertisement
 
Advertisement
Advertisement