మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం | - | Sakshi
Sakshi News home page

మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం

Feb 24 2026 9:04 AM | Updated on Feb 24 2026 9:04 AM

మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం

మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం

మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం

వరంగల్‌ క్రైం : మరింత శ్రమిస్తే భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో కూ డా పతకాలు సాధిస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. ఇటీవల సైబరాబాద్‌ కమిషనరేట్‌ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్‌ క్రీడల్లో పతకాలు సాధించిన వరంగల్‌ కమిషనరేట్‌ పోలీస్‌ క్రీడాకారులకు సోమవారం కమిషనరేట్‌ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కమిషనరేట్‌ పోలీస్‌ క్రీడాకారులు ఈసారి రాష్ట్ర స్థాయి క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారన్నారు. గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో పతకాలు కై వసం చేసుకోవడం సంతోషం కలిగిస్తోందన్నారు. క్రీడల్లో రాణించే వారికి తమ సహకారం కచ్చితంగా ఉంటుందని తెలిపారు. డీసీపీలు దార కవిత, అంకిత్‌ కుమార్‌, ట్రైనీ ఐపీఎస్‌ మనీషా నెహ్రా, అదనపు డీసీపీలు సురేశ్‌ కుమార్‌, రవి, శ్రీనివాస్‌, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, జితేందర్‌ రెడ్డి, మధుసూదన్‌, అంతయ్య, ఆర్‌ఐలు స్పర్జన్‌ రాజ్‌, సతీశ్‌ ఇన్‌స్పెక్టర్‌ షూకూర్‌, ఆర్‌ఎస్సై శరత్‌, మణికృష్ణ పాల్గొన్నారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement