● టీబీ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
నయీంనగర్ : టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా హనుమకొండలోని టీబీ ఆస్పత్రిలో ప్రజలకు నిర్వహిస్తున్న పరీక్షలు, ఎక్స్‌రేల తీరును శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఎన్ని ఎక్స్‌రే మిషన్లు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. రోజు వారీగా ఎక్స్‌రేల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ఇంకా ఎక్కువ ఎక్స్‌రేలు తీసేందుకు పీహెచ్‌సీల్లో రేడియోగ్రాఫర్ ఉంటే టీబీ ఆస్పత్రికి డిప్యూట్ చేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. అనంతరం డయాగ్నోస్టిక్స్, ఎక్స్‌రే మిషన్, ఓపీ విభాగాలను పరిశీలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారికి ముందుగా నెలకు సరిపడా పోషకాహార కిట్ అందించాలని, మిగతా కాలంలో కూడా వారికి కిట్ అందించే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, క్షయ నియంత్రణ అధికారి హిమబిందు, టీహబ్ మేనేజర్ కౌముది, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.