విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి

Jun 29 2025 6:54 AM | Updated on Jun 29 2025 6:54 AM

విద్య

విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి

కళాశాల విద్య జాయింట్‌ డైరెక్టర్‌ రాజేందర్‌సింగ్‌

విద్యారణ్యపురి/న్యూశాయంపేట: విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నతంగా ఎదగాలని కళాశాల విద్య జాయింట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాజేందర్‌సింగ్‌ కోరారు. శనివారం హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల(అటానమస్‌), కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (కేడీసీ), దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీని సందర్శించారు. ఆయా కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో పింగిళి మహిళా కళాశాల ఏప్లస్‌ గ్రేడ్‌ సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను పోటీపరీక్షలకు కూడా సన్నద్ధం చేయాలన్నారు. కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రీసెర్చ్‌సెంటర్‌గా గుర్తింపు రావడంపై అభినందించారు. సీకేఎం కళాశాలలోని గ్రంథాలయం, ప్రయోగశాల, మహిళా హాస్టల్‌ తదితర వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా సమావేశంలో ప్రిన్సిపాళ్లు బి.చంద్రమౌళి, జి.శ్రీనివాస్‌, ఎ.ధర్మారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాళ్లు సుహాసిని, రజనీలత, వరప్రసాదరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సురే్‌ష్‌బాబు, అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆరుణ, డాక్టర్‌ శశిధర్‌రావు, ప్రొఫెసర్‌ రాజారెడ్డి, టీజీసీజీటీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.చిన్న, జిల్లా కార్యదర్శి రవికుమార్‌, కేయూ సెక్రటరీ జి.సమ్మయ్య, సతీష్‌కుమార్‌, అధ్యాపకులు సీతారాములు, మహేందర్‌ శ్రీనాఽథ్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ స్వరూప తదితరులు పాల్గొన్నారు.

పీఎన్‌డీటీ చట్టం అమలుపై ప్రత్యేక నిఘా

ఎంజీఎం: జిల్లాలో లింగ నిర్ధారణ చట్టం (పీఎన్‌డీటీ) అమలు, ఎంటీపీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు ఆయా స్కానింగ్‌ కేంద్రాలు, ఆస్పత్రులపై ప్రత్యేక నిఘాతో ముందుకు సాగాలని హనుమకొండ వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య పేర్కొన్నారు. శనివారం గర్భస్థ పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి అడ్వయిజరీ సమావేశాన్ని హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ.. జిల్లాలో చట్టం అమలుకు తీసుకున్న చర్యలను, బాలికల, నిష్పత్తి గురించి సభ్యులకు వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇతర విభాగాలు లింగ వివక్షపై అవగాహన కల్పించాలని సూచించారు. ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులివ్వనున్నట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో తప్పులు సరిద్దిదుకోకపోతే జరిమానా విధించినున్నట్లు తెలిపారు. చట్టం ఉల్లంఘిస్తున్న వారి వివరాలు, అబార్షన్లు నిర్వహించే వారి వివరాలు 63000 30940 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలని, కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో బాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న వేలేరు మండలంలో ప్రత్యేక శ్రద్ధ వహించి క్షేత్రస్థాయి సిబ్బందితో తరచూ సమీక్ష నిర్వహించి వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జీఎంహెచ్‌ ప్రొఫెసర్‌ గైనకాలజిస్ట్‌ రాజేశ్వరి, పీఓఎంహెచ్‌ఎన్‌ మంజుల, సభ్యులు రేవతిదేవి, ఎన్‌.కవిత, జిల్లా కోర్టు సిబ్బంది నాగరాజు, డెమో అశోక్‌రెడ్డి, ఎస్‌ఓ ప్రసన్నకుమార్‌, హెచ్‌ఈఓ రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి1
1/1

విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement