చిక్కుల్లో చేప | - | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో చేప

Apr 21 2025 1:15 PM | Updated on Apr 21 2025 1:15 PM

చిక్క

చిక్కుల్లో చేప

స్కూళ్లలో థర్డ్‌ పార్టీ సర్వే

నాసిరకం చేపపిల్లలతో నష్టం..

ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత చేప పిల్లలు ఆరునెలలు గడిచినా అరకిలో, ముప్పావు కిలో దశలోనే ఉన్నాయి. ఈసారి పంపిణీ చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉండటంతో పాటు అదను దాటిన తర్వాత పోయడంతో ఎదుగుదల లోపించింది. దీనికితోడు రవ్వులు, బొచ్చెలు, బంగారు తీగల పేరిట సరఫరా చేసిన ఉచిత చేప పిల్లల్లో నాసిరకం (బుర్క జాతికి చెందినవి) చేప పిల్లలు వచ్చాయి. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాం.

– తెప్ప శరత్‌కుమార్‌, కార్యదర్శి, మత్స్యకారుల సంఘం, కమలాపూర్‌

రెండు, రెండున్నర అంగుళాలే..

లక్నవరం సరస్సులో 8 లక్షల 33వేల చేప పిల్లలు వదిలాం. గతేడాది జూన్‌లో పోయాల్సిన చేప పిల్లలను ఆలస్యంగా ఆగస్టు మొదటి వారంలో పోశాం. చెరువులో వదిలేటప్పుడు చేప పిల్లలు 3 అంగుళాల మీద అర ఉండాలి. రెండు, రెండున్నర అంగుళాలే ఉన్నాయి. దీంతో సైజుతో పాటు ఒక నెల ఆలస్యంగా వదలడం వల్ల చేపలు పట్టే సమయానికి అర కేజీ నుంచి కేజీ బరువు నష్టం జరుగుతుంది. దీనితో దిగుబడి అనుకున్నంత రాకపోవచ్చు.

– పి.వెంకన్న, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు, లక్నవరం

నగదు బదిలీ చేస్తేనే మేలు..

ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి బదులుగా సొసైటీలకు నగదు బదిలీ చేస్తే నాణ్యతతో కూడిన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటాం. ప్రభుత్వం అందించే చేప పిల్లలు చిన్న సైజులో, కొంత నాసిరకంగా ఉండడంతో బరువు పెరగక పోవడంతో దిగుబడి తగ్గుతున్నది. చిన్న పిల్లలను పెద్ద చేపలు తినడంతో మరింత నష్టం తప్పడం లేదు. నగదు బదిలీతో చేపల పంపిణీ కార్యక్రమం నడిపిస్తే.. నాణ్యమైన, కాస్త పెద్ద సైజు పిల్లలను కొనుగోలు చేసుకుంటాం.

– నీల సోమన్న, మత్స్యసొసైటీ చైర్మన్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌

సెప్టెంబర్‌లోనే చేప పిల్లల పంపిణీ..

గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఉచిత చేప పిల్లలు పంపిణీ చేశాం. హనుమకొండ జిల్లాలో 184 మత్స్యకార సొసైటీలు ఉండగా దాదాపు 18వేల పైచిలుకు మత్స్యకారులు సభ్యత్వం కలిగి ఉన్నారు. వేయాల్సిన సమయం కన్నా కాస్త ఆలస్యం కావడంతో 100 శాతం పంపిణీ సాధ్యం కాలేదు. అన్నిచోట్ల నిబంధనల మేరకు నాణ్యమైన చేపపిల్లలను పంపిణీ చేశాం. – నాగమణి, ఇన్‌చార్జ్‌ డీఎఫ్‌ఓ, హనుమకొండ

సాక్షిప్రతినిధి, వరంగల్‌: మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం వంద శాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. 2024–25 సంవత్సరానికి గాను ఉమ్మడి వరంగల్‌ పరిధి 3,861 నీటి వనరుల్లో ఈ ఏడాది 14.07 కోట్ల చేప పిల్లలు వదలాలి. 2024 జనవరిలోనే 35–40, 80–100 మిల్లీమీటర్ల పరిమాణమున్న చేప పిల్లల సరఫరాకు టెండర్లు పూర్తి చేశారు. ఆయా ప్రాంతాల్లో వాతావరణానికి తగినట్టుగా మెరిగలు, బొచ్చ, రవ్వులు, కట్ల, బంగారు తీగ లాంటి చేప పిల్లలను ఉత్పత్తి చేసి సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఏటా టెండర్లు దక్కించుకుంటున్న గుత్తేదారు సంస్థలు స్థానికంగా పెంచకుండా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినవి చెరువుల్లో వదిలి చేతులు దులుపుకుంటున్నారు. జూన్‌లో పంపిణీ చేయాల్సిన చేప పిల్లలను ఆగస్టులో మొదలెట్టి అక్టోబర్‌ వరకు పంపిణీ చేశారు. ఈలోగా కొన్ని మత్స్య సహకార సంఘాల నాయకులు, సభ్యులు డబ్బులు పోగేసుకుని చేప పిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోశారు. చాలాచోట్ల గుత్తేదార్లు సరఫరా చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉండగా.. వాటిలో ఇప్పటికీ ఎదుగుదల లేదని మత్స్యకారులు అంటున్నారు.

చేప పిల్లల పంపిణీ 63.11 శాతమే

ఉమ్మడి వరంగల్‌లో 3,861 చెరువులు, కుంటలు ఉండగా.. 14.07 కోట్ల చేప పిల్లలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మత్స్యశాఖ ప్రకటించింది. అయితే.. 35–40 మిల్లీమీటర్ల పిల్లలు 4.89 కోట్లు, 80–100 మిల్లీమీటర్లవి 3.99 కోట్లు.. మొత్తం 8.88(63.11 శాతం) కోట్లు పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి జూన్‌ మొదటి వారం నుంచే చేప పిల్లలు చెరువుల్లో పోయాల్సి ఉంది. అలాగైతే ఆరేడు నెలల గడువులో ఒక్కో నెలకు పావుకిలో పెరిగినా రెండు, రెండున్నర కిలోలకు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఓ వైపు నాసిరకం విత్తన చేపపిల్లలు, మరోవైపు ఆలస్యంగా చెరువుల్లో వదలడం.. ఎండిపోతున్న చెరువుల్లో తీవ్రమైన ఎండవేడి.. ఈ ప్రతికూల కారణాలతో చెరువులో చేప ఎదగడం లేదు. మార్చి చివరి నుంచి చేపలు పట్టే అవకాశం ఉన్నా 450–750 గ్రాముల సైజులోనే ఉండడంతో మిన్నకుండిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్టర్లు, దళారులతో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయకుండా వాటికి అయ్యే మొత్తాన్ని నేరుగా మత్స్య పారిశ్రామిక సంఘాల అకౌంట్లలోకి జమ చేస్తే.. నచ్చిన చేప పిల్లలను సకాలంలో కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో పోస్తే మంచి ఫలితాలు వస్తాయని మత్స్యకారులు, సంఘాల నాయకులు అంటున్నారు.

పవిత్రమైన పండుగ ఈస్టర్‌

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

ఎదుగూ బొదుగు లేని మీనం

టెండర్లు, చేప పిల్లల పంపిణీలో ఆలస్యం..

సిండికేట్‌గా మారిన కాంట్రాక్టర్లు.

నాసిరకం, ఇష్టారాజ్యంగా సరఫరా

750 గ్రాముల బరువు దాటని చేపలు

ఎండదెబ్బ.. దిగుబడిపై సన్నగిల్లిన ఆశలు

నష్టపోతున్నామంటున్న మత్స్యకారులు

చెరువులు, చేప పిల్లల పంపిణీ వివరాలు

ఉమ్మడి జిల్లాలో చెరువులు : 3,861

ఉచిత చేప పిల్లల పంపిణీ లక్ష్యం : 14.07 కోట్లు

3,462 చెరువుల్లో పోసిన చేప పిల్లలు : 8.88 కోట్లు

35 నుంచి 45 మిల్లీమీటర్ల చేపలు: 4.89 కోట్లు

80 నుంచి 100 మిల్లీమీటర్ల చేపలు: 3.99 కోట్లు

పెరగాల్సిన సైజు : 1.5 కేజీ నుంచి 2.5 కేజీలు

ప్రస్తుత సైజు : 450 నుంచి 750 గ్రాములు

చిక్కుల్లో చేప1
1/4

చిక్కుల్లో చేప

చిక్కుల్లో చేప2
2/4

చిక్కుల్లో చేప

చిక్కుల్లో చేప3
3/4

చిక్కుల్లో చేప

చిక్కుల్లో చేప4
4/4

చిక్కుల్లో చేప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement