హన్మకొండ కల్చరల్: తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో స్థానం పొందడానికి ప్రముఖ గాయకుడు టీవీ రమేశ్, మాధవి గాయనీగాయకులతో కలిసి 12 గంటల పాటు నిర్విరామంగా సంగీ త విభావరి నిర్వహించారు. ఆదివారం ఉద యం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ రికార్డ్ జ్యూరీ మెంబర్ టీవీ అశోక్‌కుమార్, ప్రముఖ సంగీత విద్వాంసులు తిరుపతయ్య, సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీఎఫ్‌ఓ పురుషోత్తం, తొగరు శ్రీనివాస్, చంద్రశేఖర్, పరమేశ్వరి, వనపర్తి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు,
డీఏలు విడుదల చేయాలి
విద్యారణ్యపురి: ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ బిల్లులు, డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలో ఆ ఉపాధ్యాయ సంఘం కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చిన సీపీఎస్ విధానం రద్దు, ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు ఇప్పకాయల కుమారస్వామి, చంద్రగిరి లక్ష్మ య్య, జిల్లా కార్యదర్శి గొడిశాల రమేశ్, బాధ్యులు భిక్షపతి, భాస్కర్, పి.సదానందం తదితరులు పాల్గొన్నారు.
విశ్వకర్మల ఐక్యతకు కృషి
హన్మకొండ: విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతి ఐక్యత కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని స్వగృహంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికై న దాసోజు శ్రావణ్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ సంఘీయుడు తమ పేరు చివరన విశ్వకర్మగా రాసుకోవాలని, అలాగే పిలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వేములవాడ మదన్‌మోహన్, గౌరవాధ్యక్షుడు లాలుకోట వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు, నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయిలో
శశాంక్‌కు గోల్డ్ మెడల్
కాజీపేట అర్బన్: 31వ డివిజన్ న్యూశాయంపేటకు చెందిన సెయింట్ పీటర్స్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న గుజ్జేటి శశాంక్ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈనెల16న ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించిన ఏపీ, తెలంగాణ రాష్ట్ర స్థాయి 14వ ఓపెన్ పోటీల్లో శశాంక్ 48 కేజీల విభాగంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. తైక్వాండో పోటీల్లో ప్రత్యేకతను చాటుతూ జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్ సాధించడమే తన లక్ష్యమని శశాంక్ చెబుతున్నాడు.
12 గంటలు.. నిర్విరామ సంగీత విభావరి