
మాట్లాడుతున్న అనిల్ కూర్మాచలం
హన్మకొండ: అభివృద్ధి చేసే పార్టీని ఆదరించాలని బీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ అధ్యక్షుడు, రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం అన్నారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలన్నారు. బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ ప్రధాన కార్యదర్శి కడుదుల రత్నాకర్, ఎన్‌ఆర్‌ఐ సెల్ అమెరికా నాయకురాలు బింధులత మాట్లాడుతూ దేశంలోనే రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి గొప్ప పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌ను మరోసారి సీఎం చేయాలన్నారు. సమావేశంలో ఎన్‌ఆర్‌ఐ సెల్ నాయకులు కోరబోయిన విజయ్ కుమార్, నవీన్ రెడ్డి, గొట్టిముక్కల సతీష్ రెడ్డి, శానబోయిన రాజ్ కుమార్, ప్రవీణ్ పంతులు, ఆకుల వినయ్ పాల్గొన్నారు.
ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం