సృజనాత్మకత పెంపునకు సైన్స్‌ఫెయిర్‌ తోడ్పాటు | - | Sakshi
Sakshi News home page

సృజనాత్మకత పెంపునకు సైన్స్‌ఫెయిర్‌ తోడ్పాటు

Dec 21 2025 6:57 AM | Updated on Dec 21 2025 6:57 AM

సృజనాత్మకత పెంపునకు సైన్స్‌ఫెయిర్‌ తోడ్పాటు

సృజనాత్మకత పెంపునకు సైన్స్‌ఫెయిర్‌ తోడ్పాటు

సృజనాత్మకత పెంపునకు సైన్స్‌ఫెయిర్‌ తోడ్పాటు

ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు

విద్యారణ్యపురి: విద్యార్థుల్లో సృజనాత్మకతకు సైన్స్‌ఫెయిర్‌ దోహదం చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. హనుమకొండలోని సెయింట్‌ పీటర్స్‌ ఎడ్యూ స్కూల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు శనివారం సాయంత్రం ముగిశాయి. ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడారు. మానవాళి ప్రకృతిని నాశనం చేస్తుండడంతో అనేక అనర్థాలు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల హనుమకొండ నగరానికి వచ్చిన వరదలే ఉదాహరణ అన్నారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు వారు బహుమతులు ప్రదానం చేశారు. విద్యాశాఖ అధికారి ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్‌, జిల్లా సైన్స్‌ అధికారి ఎస్‌.శ్రీనివాసస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్‌ కోఆర్డినేటర్‌ బద్దం సుదర్శన్‌రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి బి.రాంధన్‌, ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డినేటర్‌ ఎ.సదానందం, సెయింట్‌ పీటర్స్‌ ఎడ్యూ స్కూల్‌ అధినేత నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్‌ హరిత, వడుప్సా జిల్లా అధ్యక్షుడు మాదాల సతీశ్‌కుమార్‌, హనుమకొండ, కాజీపేట ఎంఈఓలు నెహ్రూనాయక్‌, మనోజ్‌కుమార్‌, ప్రభుత్వ మర్కజీ హై స్కూల్‌ ఉపాధ్యాయుడు వల్స పైడి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement