హనుమకొండ డీఆర్‌డీఏకు అవార్డు

- - Sakshi

హన్మకొండ: సీ్త్ర నిధి క్రెడిట్‌ డిస్బర్స్‌మెంట్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన హనుమకొండ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు 2021–2022 సంవత్సరానికి ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా చేతుల మీదుగా జిల్లా డీఆర్‌డీఓ శ్రీనివాస్‌కుమార్‌ అవార్డు అందుకున్నారు.

దరఖాస్తు గడువు పొడిగింపు

కాజీపేట అర్బన్‌: బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు గడువును ఈ నెల 3వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంపీవీ.ప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల కోసం లష్కర్‌ బజార్‌లోని కార్యాలయంలో, వివరాలకు 0870–257 1192 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

బదిలీలు, ప్రమోషన్లు

చేపట్టాలి

విద్యారణ్యపురి: కోర్టు స్టేను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే బాధ్యత వహించి టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం హనుమకొండలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేక, పాఠశాలల్లో ఖాళీ పోస్టులు నింపకపోవడంతో విద్యావ్యవస్థ కుంటుపడిపోయిందన్నారు. బదిలీలు, ప్రమోషన్లకు షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ కోర్టులో స్టే ఉండడంతో ఆగిపోయాయన్నారు. ప్రభుత్వమే బాధ్యత వహించి స్టేను ఎత్తి వేయించి బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు డాక్టర్‌ ఎం.గంగాధర్‌, డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సుదర్శనం, రాష్ట్ర కౌన్సిలర్‌ ఎ.సంజీవరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బి.అంజనీదేవి, ఎన్‌.సుభాషిణి, డి.రమేష్‌, సీహెచ్‌.అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

నూతన పీఆర్‌సీ పే

కమిషన్‌ను ప్రకటించాలి

విద్యారణ్యపురి: నూతన పీఆర్‌సీ పే కమిషన్‌ను వెంటనే ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్‌ సురేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హనుమకొండ, వరంగల్‌ జిల్లాశాఖల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాక్టిసింగ్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన ఆ సంఘం రెండు జిల్లాల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. సమావేశంలో రెండు జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆముదాల దాతమహర్షి, బత్తిని వెంకటరమణగౌడ్‌, బత్తిని వీరస్వామి, ఉప్పుల సతీష్‌, పూర్వవరంగల్‌ జిల్లా అధ్యక్షుడు బాలాజీరావు, బాధ్యులు రాంభూపాల్‌, సత్యనారాయణరావు, దయాకర్‌, ప్రతాపగిరిశ్రీనివాస్‌, రామకృష్ణ, శ్రీనివాస్‌, శేఖర్‌, బాబురావు పాల్గొన్నారు.

Read latest Hanamkonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top