
హనుమకొండ బార్ అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి
వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్లకు శుక్రవారం పోలింగ్ జరిగింది. రెండు జిల్లాల ఎన్నికలు ఒకేచోట నిర్వహించడంతో జిల్లా కోర్టు ప్రాంగణం న్యాయవాదులతో సందడిగా మారింది. పలు స్థానాలు ఏకగ్రీవం కాగా, ప్రధాన పోస్టులకు ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం ఓట్ల లెక్కింపు నిర్వహించి విజేతలను ప్రకటించారు.
వరంగల్ జిల్లాలో..
వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఈ. ఆనంద్‌మోహన్ ఎన్నికై న్నట్లు ఎన్నికల పరిశీలకులు చిదంబర్‌నాథ్ తెలిపారు. మొత్తం 723మంది ఓట్లకుగాను 485 ఓట్లు పోలయ్యాయి.
● అధ్యక్షుడిగా ఈ.అనంద్‌మోహన్ తన సమీప అభ్యర్థి రాఘవరావుపై 44 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ.ఆనంద్‌మోహన్‌కు 189 ఓట్లు రాగా, శ్రీ రాఘవరావుకు 145ఓట్లు వచ్చాయి.
● ఉపాధ్యక్షుడిగా ఆర్.ఆనందరావు గెలుపొందారు. ఆయనకు 277 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా పి.యాకస్వామి 152 ఓట్లు, జాయింట్ సెక్రెటరీ (లైబ్రరీ) బి.శ్రీనివాస్ 256 ఓట్లు, కోశాధికారిగా ఆర్.అమృతరావు 249 ఓట్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ నం .2 (20 సంవత్సరాలు) ఈ.వేణుగోపాల్ 306 ఓట్లు సాధించి గెలుపొందారు.
● జాయింట్ సెక్రటరీగా పి.శ్రీనివాస్, మహిళా జాయింట్ సెక్రటరీగా ఎ.కవిత, జాయింట్ సెక్రటరీ (స్పోర్ట్స్ అండ్ కల్చరల్) జి.వెంకటరమణ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ (30 సంవత్సరాల పై బడిన) ఎస్.శ్రీనివాస్, మహిళా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ( 10 సంవత్సరాలకు పై బడిన) పి.పద్మావతి, ఎగ్జిక్యూటివ్ కమిటీ (పురుషులు) కె.జగదీష్, కె.పూర్ణచందర్, బి.రమేష్, ఎన్.సీహెచ్‌శే శేషాచార్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ (మహిళ) ఎస్.అరుణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
● ఈ.ఆనంద్ మోహన్ గెలుపుతో జిల్లా బార్ అసోసియేషన్ చరిత్రలోనే వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికై న తొలి వ్యక్తిగా రికార్డు నమోదు చేశారు. ఎన్నికై న నూతన కార్యవర్గానికి పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు అభినందనలు తెలిపారు.
హనుమకొండ బార్ ఎన్నికలు..
హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వై.శ్యాంసుందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో 803 ఓట్లకుగాను 709 ఓట్లు పోలైనట్లు ఎన్నికల పరిశీలకులు రవీందర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణలు తెలిపారు. అధ్యక్షుడిగా వై.శ్యాంసుందర్‌రెడ్డి 261 ఓట్లు సాధించారు. ఉపాధ్యక్షుడుగా వి.దయన్ శ్రీనివాసన్ 276 ఓట్లు, ప్రధాన కార్యదర్శిగా జి.శ్రీధర్ 534 ఓట్లు, జాయింట్ సెక్రటరీగా సీహెచ్.శ్రీనివాస్ 534 ఓట్లు రాగా, విజేతలుగా నిలిచారు.
● జాయింట్ సెక్రటరీ (మహిళ) వి.ఇందిరా విశాలి, జాయింట్ సెక్రటరీ (స్పోర్ట్స్ అండ్ కల్చ రల్) ఎం.విజేందర్ 305 ఓట్లు, కోశాధికారిగా వి.అండాలు 373 ఓట్లు సాధించి గెలుపొందారు.
● జాయింట్ సెక్రటరీగా (లైబ్రరీ) అజ్మీరా కిరణ్‌సింగ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా (30 సంవత్సరాలు పై బడిన) కేవీకే గుప్తా, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ (మహిళ) (10 సంవత్సరాలు పై బడిన) ఎం.పద్మలత గౌడ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కమిటీ సంబరాలు జరుపుకుంది. సభ్యులకు పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ అధ్యక్షుడిగా
ఈ.ఆనంద్ మోహన్
హనుమకొండ అధ్యక్షుడిగా
శ్యాంసుందర్‌రెడ్డి

ప్రధాన కార్యదర్శి జి.శ్రీధర్

వరంగల్ బార్ అధ్యక్షుడు ఆనంద్‌మోహన్

ప్రధాన కార్యదర్శిగా పి.యాకస్వామి