
మాట్లాడుతున్న కలెక్టర్ ప్రావీణ్య, పక్కన అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ, శ్రీవత్స
వరంగల్ రూరల్: ఇటీవల వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించేందుకు అధికారులు చేపట్టిన సర్వే పారదర్శకంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వ్యవసాయ అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, మండల గణాంక అధికారులతో పంట నష్టం సర్వేపై కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సలహాలు సూచనలు చేశారు. సమగ్ర వివరాలతో కూడిన సమాచారాన్ని సింగిల్ డాక్యుమెంట్లలో సమర్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీవత్స, జేడీఏ ఉషాదయాళ్, సీపీఓ గుర్రాల జీవరత్నం, శ్రీనివాసరావు పాల్గొన్నారు.