
స్పిక్‌మేకేలో ప్రదర్శన ఇస్తున్న ధృవ్‌బేడీ, నిజాముద్దీన్ ఖాద్రీ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన స్పిక్‌మేకే కల్చరల్ ప్రోగ్రాం అలరించింది. ప్రముఖ సితార్ వాయిద్యకారుడు ధృవ్‌బేడీ, తబలా ప్లేయర్ మహ్మద్ నజీముద్దీన్ ఖాద్రీలు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. నిట్‌లోని స్పిక్‌మేకే (సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ ఎమంగ్స్ యూత్) యువతకు మన సంస్కృతీ సంప్రదాయాలను, ప్రాచీన కళలకు పునర్‌వైభవం తీసుకువచ్చే వేదికగా ఏర్పాటు చేసినట్లు నిట్ రిజిస్ట్రార్ గోవర్ధన్‌రావు తెలిపారు. కార్యక్రమంలో డీన్ ఫ్యాకల్టీ అఫైర్స్ కామేశ్వర్‌రావు, ప్రొఫెసర్ వైఎన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.