
ఎంఓయూ పత్రాలను అందజేసుకుంటున్న ప్రతినిధులు
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో యూకేలోని వేసువియాస్ ఇండియా లిమిటెడ్ సంస్థ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. డైరెక్టర్ ఎన్వీ.రమణారావు, వేసువియాస్ సంస్థ సీఎస్‌ఆర్ ఇనిషియేటివ్ మేనేజర్ రాజశ్రీదాస్‌లు పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఎంఓయూ ద్వారా నిట్‌కు చెందిన మెకానికల్, బెటలర్జీ, కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ముగ్గురు బీటెక్ విద్యార్థినులకు సెకండియర్ నుంచి ఫైనలియర్ వరకు వేసుమియాస్ స్కాలర్‌షిప్ ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను అందజేస్తుందని నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఉమామహేష్, డేవిడ్‌సన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.