
నగరంలోని పలు ఆలయాల్లో రాములోరి కల్యాణం వైభవంగా జరిగింది. హనుమకొండ వేయిస్తంభాల ఆలయంలో గురువారం ఉదయం ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ లక్ష్మణ సమేత శ్రీసీతారాములవార్లకు మంగళస్నానం, నూతన వస్త్ర అలంకరణ, ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. మంగళవాయిద్యాలు మోగుతుండగా శ్రీసీతారాముల కల్యాణ క్రతువును వేదోక్తంగా నిర్వహించారు. వరంగల్ శివనగర్‌లోని శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మధ్యాహ్నం 12.05 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణం జరిపారు. భక్తులు సుందరదృశ్యాన్ని దర్శించుకుని పునీతులయ్యారు. – హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్
– మరిన్ని ఫొటోలు 9లోu


