
పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేస్తున్న పొదుపు సంఘాల మహిళలు, పారిశుద్ధ్య సిబ్బంది
వరంగల్ అర్బన్: జీరో వేస్ట్ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నగరంలోభారీ ర్యాలీ నిర్వహించారు. బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద ర్యాలీని డిప్యూటీ కమిషనర్ అనిసుర్ ఉర్ రషీద్ జెండా ఊపి ప్రారంభించారు. ఎంజీఎం జంక్షన్ మీదుగా కేఎంసీ వరకు నిర్వహించారు. సర్కిల్‌లో పొదుపు సంఘాల మహిళలు, బల్దియా పారిశుద్ధ్య సిబ్బంది మానవహారం నిర్వహించి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రషీద్, సఎంహెచ్‌ఓ రాజేష్, సీహెచ్‌ఓ శ్రీనివాస రావు, సెక్రటరీ విజయలక్ష్మి, శానిటరీ సూపర్ వైజర్లు పాల్గొన్నారు.