వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవత్స
వరంగల్ రూరల్: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ అని, పండుగకు ప్రభుత్వం అందించే గిఫ్ట్ ప్యాకెట్లను ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట అధికారులను ఆదేశించారు. రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవత్స మాట్లాడుతూ జిల్లాలో ఇఫ్తార్ విందులకు రూ.12లక్షలు కేటాయించగా.. 6వేల గిఫ్ట్ ప్యాకెట్లను మూడు నియోజకవర్గాల పరిధిలోని 12 మసీదుల్లో పంపిణీ చేయడానికి గుర్తించామన్నారు. సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కె.విక్రమ్‌కుమార్, బల్దియా అడిషనల్ కమిషనర్ అనిసుర్ రషీద్, ఏసీపీలు ఏసీపీ ఏ.సంపత్‌రావు, శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ, ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.