
కుక్క దాడికి గురైన విద్యార్థిని వర్షిత
ఖిలా వరంగల్:ప్రథమ చికిత్సతోనే ప్రాణాలు నిలుస్తాయని, ప్రతి ఒక్కరూ సీపీఆర్‌పైన అవగాహన పెంచుకోవాలని టీఎస్‌ఎస్పీ నాలుగో బెటాలియన్ కమాండెంట్ సింధుశర్మ సూచించారు మంగళవారం మామునూరు టీఎస్‌ఎస్పీ నాలుగో బెటాలియన్ ఆడిటోరియంలో మాక్స్ కేర్ హాస్పిటల్ హనుమకొండ వారి ఆధ్వర్యంలో స్పెషల్ పోలీసులకు ప్రథమ చికిత్స, సీపీఆర్ అంశంపై అవగాహన కల్పించారు. అసిస్టెంట్ కమాండెంట్ నరేందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రాంబాబు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఆసీఫ్ ఇక్బాల్, డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ ప్రియదర్శిని, ఆర్‌ఐలు శోభన, చంద్రన్న, దయాశీల, ఏవీఎన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు , నాగేశ్వరరావు, ఆసోసియేషన్ అధ్యక్షుడు సోమన్న, ఆర్‌ఎస్‌ఎస్సైలు పాల్గొన్నారు.
విద్యార్థినిపై వీధికుక్క దాడి
కాశిబుగ్గ: వరంగల్ నగరంలోని 20వ డివిజన్ రుద్రమాంబ వీధి మార్కండే గుడి సమీపంలో పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థినిపై వీధికుక్క దాడి చేసి గాయ పరిచింది. రుద్రమాంబ వీధికిచెందిన ఓని మహేష్ కుమార్తె వర్షిత(14) కాశిబుగ్గ నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత ప్రాఠశాల(గుడిబడి)లో 8వ తరగతి చదువుతోంది. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా కుక్క దాడికి పాల్పడింది. స్థానికులు గమనించి ఆ కుక్కపై రాయి విసరడంతో వెళ్లిపోయింది. అప్పటికే వర్షిత కుడిచేయిపై రెండుచోట్ల కరిచింది. స్థానికుల సమాచారంతో తల్లిదండ్రులు బాలికను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుక్కల విషయం సంబంధిత ఆధికారుల దృష్టికి తీసుకెళ్తే ఒక రోజు కొన్నింటిని పట్టుకుని ప్రచార ఆర్భాటం చేస్తున్నారని, ఆ తరువాత వదిలేస్తున్నారని స్థానికులు వాపోయారు.

మాట్లాడుతున్న సింధుశర్మ
