మెడికల్‌ ఫ్రాడ్‌: వ్యాక్సినేషన్‌ దందా!

Ways to Help Protect Yourself From Cybercrime, Solutions to Fight Cybercrime - Sakshi

సోషల్‌ మీడియా అనేది వాయిస్‌ లేని వ్యక్తులకు గొంతుకైన గొప్ప వేదిక. కానీ, దురదృష్టవశాత్తు ఈ మహమ్మారి కాలంలో నకిలీ సమాచార సమస్య దేశంలో చాలా విస్తృతంగా ఉంది. దీని కారణంగా మోసపోతున్నవారి సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది. 

రమణి, గోపాల్‌ (పేర్లు మార్చాం) ఇద్దరూ ఏడు పదుల వయసు దాటిన వారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ దంపతులిద్దరే ఇంట్లో ఉంటారు. కరోనా లక్షణాలున్నాయేమో అనే అనుమానంతో టెస్టుల కోసం ఆన్‌లైన్‌లో ఓ ల్యాబ్‌కు తమ వివరాలతో టైమ్‌ స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. ఓ అరగంటలో ల్యాబ్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ముందస్తుగా టెస్టులకు ఎంత మొత్తం అవుతుందో ఫోన్‌ ద్వారా అవతలి వ్యక్తి సమాచారం ఇచ్చారు. వారు అడిగిన మొత్తాన్ని మనీ యాప్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. మరో అరగంటలో ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి, నమూనాలు సేకరించుకొని వెళ్లారు.  కానీ, ఆ తర్వాత వాళ్లు ఎలాంటి రిపోర్ట్‌ ఇవ్వలేదు. సదరు ల్యాబ్‌కి ఫోన్‌ చేస్తే, మా దగ్గర నుంచి ఎవరూ రాలేదన్నది ఆ సమాచార సారాంశం. తాము మోసపోయామన్నది ఇద్దరికీ అర్థమైంది. 


కొందరు ఇంటి వద్దకు వచ్చి, శాంపుల్స్‌ తీసుకున్నాక డబ్బులు తీసుకుంటామని నమ్మబలికి ఇంటికి వస్తారు. భయాలను కలిగించి, ముందస్తు ప్రణాళిక అంటూ లక్షల రూపాయల మోసం చేసే అవకాశాలూ ఉన్నాయంటున్నాయంటున్నారు నిపుణులు. రకరకాల ల్యాబ్స్‌ పేరుతో మోసపూరిత వెబ్‌సైట్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వాటి విషయాల్లో జాగ్రత్త అవసరం. 

మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు
ప్రస్తుత అత్యవసర పరిస్థితిని ఆసరాగా తీసుకున్న సైబర్‌ నేరగాళ్లు వేలల్లో, లక్షల్లో పలుకుతున్న కొన్ని ఇంజక్షన్లు, కరోనా మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు తమ వద్ద లభిస్తాయంటూ సోషల్‌ మీడియాను విరివిగా వాడుతున్నారు. పాజిటివ్‌ పీపుల్‌కి సంబంధించిన ఫోన్‌ నెంబర్లు ట్రాప్‌ చేసి కూడా మా వద్ద మెడికల్‌కు సంబంధించినవి లభిస్తాయి. మీరు ముందే బుక్‌ చేసుకుంటే, చెప్పిన మొత్తాన్ని ముందే ట్రాన్స్‌ఫర్‌ చేస్తే తక్కువ ధరకే అందజేస్తాం అంటూ నమ్మబలికే వారూ ఉంటున్నారు. 

వ్యాక్సినేషన్‌ దందా!
టీకా డ్రైవ్‌ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడానికి వ్యక్తులకు అనుమతించింది. రిజిస్ట్రేషన్‌  కోసం కో–విన్‌ అనే ప్లాట్‌ఫామ్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయితే, సైబర్‌ క్రిమినల్స్‌ వారి పేర్లలో భాగంగా కో–విన్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లను కూడా విడుదల చేసిన సందర్భాలూ ఉంటున్నాయి. 

వెబ్‌సైట్‌ ఫిల్టర్‌ తప్పనిసరి
► వెబ్‌ సైట్‌ మూలం తప్పక తెలుసుకోవాలి.
► వెబ్‌సైట్‌ URL, దాని చట్టబద్ధతను తనిఖీ చేయాలి. 
► ఆ వెబ్‌ సైట్‌లో పొందుపరిచిన పూర్తి సారాంశాన్ని చదివి, అర్థం చేసుకోవాలి.
► గుడ్డిగా నమ్మకుండా మరొకరి అభిప్రాయం తప్పక తెలుసుకోవాలి. 

శక్తిమంతమైన వేదిక
► మా కజిన్‌ ప్లాస్మా, రెమిడెసివర్‌ ఇంజక్షన్‌ కోసం నన్ను సంప్రదించారు. నాకు తెలిసిన స్నేహబృందం, పై అధికారుల వరకు అందరినీ ఫోన్‌ ద్వారా సంప్రదించాను. కానీ, లాభం లేకపోయింది. చివరకు వాట్సప్‌ స్టేటస్‌లో విషయాన్ని ప్రస్తావించాను. వెంటనే నాకు సాయం లభించింది. సోషల్‌ మీడియా అనేది శక్తిమంతమైన ప్లాట్‌ఫాం. దీనిని మంచికోసం ఉపయోగించుకుందాం. చెడు చేసే నేరగాళ్లకు అడ్డుకట్ట వేద్దాం. 

నకిలీ సమాచారాన్ని తెలుసుకోవడానికి... 
► గూగుల్‌ రివర్స్‌ ఇమేజ్‌ చెక్‌ చేయాలి. ఫొటో వెరిఫికేషన్‌ కోసం www.tineye.comని ఉపయోగించవచ్చు. 
ఫొటో లేదా వీడియో తనిఖీకి (https://www.invid-project.eu/tools-and-services/invid-verification-plugin/) ఇన్‌స్టాల్‌ చేసి తెలుసుకోవచ్చు. 

► మీకు తెలియని, నమ్మకం లేని కంటెంట్‌ను ఫార్వర్డ్‌ చేయవద్దు. సమాచారం సరైనది అయితేనే ఫార్వర్డ్‌ చేయాలి. 

www.who.int నుండి లేదా ప్రభుత్వ వెబ్‌ సైట్‌ (gov.in) నుండి మాత్రమే వచ్చిన సమాచారాన్ని నమ్మాలి, ఫార్వర్డ్‌ చేయాలి.
 
► అంతర్జాతీయ సమాచారం అయితే  www.factlu.inలో చెక్‌ చేసుకోవచ్చు. 
►  ఎ) ప్రస్తుతం మా వద్ద ఇన్ని సంఖ్యలో బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. బి) కోవిడ్‌కు సంబంధించిన మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు లభిస్తాయి. సి) కోవిడ్‌ ప్రభావిత ప్రాంతాలు.. వంటి వాటిలా కనిపించే లింక్స్‌పై క్లిక్‌ చేయవద్దు.

మీరు సామాజిక మాధ్యమాల ద్వారా మోసపోయామని గ్రహిస్తే.. ఈ కింది వెబ్‌సైట్లలో ఫిర్యాదు చేయవచ్చు. ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చు. 

https://www.cybercrime.gov.in 
https://www.cowin.gov.in
https://covid19.telangana.gov.in
https://www.mohfw.gov.in/

సైబరాబాద్‌ పోలిస్‌ సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌
సెక్యూరిటీ కౌన్సిల్‌ కోవిడ్‌ కంట్రోల్‌ సెంటర్‌ :  9490617440/ 9490617431
ఫ్రీ కోవిడ్‌ టెలీ మెడిసిన్‌ సర్వీస్‌: +91 8045811138/ 080–45811138
కోవిడ్‌కు సంబంధించిన ఏ సమాచారానికైనా.. covid.scsc.in లాగిన్‌ అయ్యి తెలుసుకోవచ్చు. 
కోవిడ్‌ కేర్‌  హెల్ప్‌లైన్‌ : 080–45811138 

– అనీల్‌ రాచమల్ల
డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌ ఫౌండర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top