గంగజాతర.. మొదలైందహో.. | gangamma jatara in Tirupathi | Sakshi
Sakshi News home page

గంగజాతర.. మొదలైందహో..

May 6 2026 9:34 AM | Updated on May 6 2026 11:29 AM

gangamma jatara in Tirupathi

తిరుపతి కల్చరల్‌: ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా.. బుధవారం నుంచి వారం రోజుల పాటు తిరుపతిలో గంగజాతర జరగనుంది.. కనుక నగరవాసులెవరూ ఊరు వదలి వెళ్లరాదు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రి పూట ఇక్కడ బస చేయకుండా తిరిగి వెళ్లిపోవాలహో.. అని కైకాల వారు మంగళవారం రాత్రి చాటింపు వేశారు. భేరివీధిలో తొలి చాటింపు పూజ చేసి, నాటి నగర శివారు ప్రాంతాలైన నాలుగు కాళ్ల మండపం, హెడ్‌పోస్టాఫీస్, కృష్ణాపురం ఠాణా, పాత మెటర్నటీ ఆస్పత్రి సర్కిల్‌లో మంగళవారం అర్ధరాత్రి అష్టదిగ్భందనం చేసి జాతరకు శ్రీకారం చుట్టారు. 

జాతరలో భాగంగా ఉదయం 7.30 గంటలకు ఆలయ అవరణలోని అమ్మవారి విశ్వరూప కొడిస్తంభానికి భక్తుల సమక్షంలో శాస్తోక్తంగా అభిషేకం, పూజలు చేసి, ఒడిబాలు సమర్పించారు. అలాగే ఆలయంలో అమ్మవారి మూలవిరాట్టుకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు, విశేషాలంకరణ చేసి కొలువు తీర్చారు. ఈ సందర్భంగా భక్తులు  పొంగళ్లు పెట్టి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. 

అవిలాల నుంచి తిరుపతి గంగమ్మకు సారె సమర్పణ 
తిరుపతి రూరల్‌: తాతయ్యగుంట గంగమ్మ జాతర చాటింపు సందర్భంగా మంగళవారం రాత్రి అమ్మవారికి అవి లాల నుంచి పుట్టింటి సారె తీసుకొచ్చా రు. అవిలాలలోని సుబ్బరామిరెడ్డి ఇంటి నుంచి ఆడపడుచుకు పుట్టింటి సారెను అవిలాల పొలిమేరలోని గంగమ్మ గుడి వద్దకు తీసుకొచ్చారు. ఆ సారెను  తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఈఓ, సిబ్బంది, పాలక మండలి సభ్యులు కైకాల వంశీకులు అందుకుని అమ్మవారికి సారె తీసుకువెళ్లారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement