హెయిర్ రిస్టోరేషన్ వైద్య సేవల్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్ Eugenix Hair Sciences సంస్థకు National Accreditation Board for Hospitals & Healthcare Providers (NABH) గుర్తింపు లభించింది. ఈ సంస్థకు చెందిన గురుగ్రామ్ ఫ్లాగ్షిప్ క్లినిక్ ప్రతిష్టాత్మక అక్డ్రిడిటేషన్ గుర్తింపు, సంస్థ నాణ్యత, పేషెంట్ సేఫ్టీ, క్లినికల్ ఎక్సలెన్స్ పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిందనీ నిర్వాహకులు తెలిపారు.
NABH అక్డ్రిడిటేషన్ అనేది సాధారణ గుర్తింపు కాదనీ పేషెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోటోకాల్స్, క్లినికల్ కమ్యూనికేషన్, మెడికేషన్ సేఫ్టీ, ఇన్ఫెక్షన్ కంట్రోల్, సర్జికల్ సేఫ్టీ వంటి కీలక అంశాల్లో 600కి పైగా ప్రమాణాల ఆధారంగా జరుగే కఠినమైన మూల్యాంకనం తర్వాత మాత్రమే ఈ గుర్తింపు లభిస్తుందని వివరించారు. ఈ గుర్తింపుతో గురుగ్రామ్ క్లినిక్, అంతర్జాతీయ పేషెంట్ సేఫ్టీ గోల్స్ (IPSG) ప్రమాణాలకు అనుగుణంగా సేవలు అందిస్తున్నట్లు ధృవీకరించారు.
ఈ క్లినిక్ యూజెనిక్స్ ప్రధాన క్లినికల్ ఎక్సలెన్స్, రీసెర్చ్, ట్రైనింగ్ సెంటర్గా పనిచేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రంలో అధునాతన సర్జికల్ సదుపాయాలు, అమెరికా, జర్మనీ నుంచి దిగుమతి చేసిన మాంటిస్ మైక్రోస్కోప్స్, హై-మ్యాగ్నిఫికేషన్ లూప్స్ — అందుబాటులో ఉన్నాయి. డెర్మటాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు, సీనియర్ ఫిజీషియన్లు కలిసిన మల్టీడిసిప్లినరీ టీమ్ ఇక్కడ సేవలు అందిస్తోంది.
సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ డా. ప్రదీప్ సేథి మాట్లాడుతూ…“ఈ NABH గుర్తింపు మా సంస్థలో నెలకొల్పిన క్లినికల్ ఎక్సలెన్స్ కల్చర్కు, పేషెంట్ సేఫ్టీపై మా దృష్టికి ప్రతిబింబం. శాస్త్రీయ నైపుణ్యం, ఆర్టిస్టిక్ అప్రోచ్ కలయికతో ప్రతి రోగికి ఉత్తమ ఫలితాలు అందించడమే మా లక్ష్యం,” అని తెలిపారు. “మా గురుగ్రామ్ సెంటర్ను గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా రూపకల్పన చేశాం. ఈ అక్డ్రిడిటేషన్ మా సిస్టమ్స్, ప్రాసెస్‌లు, పేషెంట్-ఫస్ట్ అప్రోచ్‌కు మరింత బలాన్ని ఇచ్చింది,” అని కో-ఫౌండర్ డా. అరికా బన్సాల్ అన్నారు.
(చదవండి: ఆ రైడ్‌కి ఐదు స్టార్‌లు..! కించెత్తు సంభాషణకు నో ఛాన్స్..)


